Share News

‘వారిపై చర్యలు తీసుకోండి’

ABN , Publish Date - Jan 29 , 2026 | 12:14 AM

పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పరువుకు భంగం కలిగేలా ఓ ఛానెల్‌ ప్రసారం చేసిందని, దీనిపై విచారణ జరిపి చేపట్టి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు కోరారు.

 ‘వారిపై చర్యలు తీసుకోండి’
పలాస: ఎస్‌ఐకి వినతిపత్రం అందిస్తున్న టీడీపీ నాయకులు

పలాస, జనవరి 28(ఆంధ్రజ్యోతి): పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పరువుకు భంగం కలిగేలా ఓ ఛానెల్‌ ప్రసారం చేసిందని, దీనిపై విచారణ జరిపి చేపట్టి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు కోరారు. ఈ మేరకు బుధవారం ఎస్‌ఐ నర్సింహమూర్తిని కలిసి ఫిర్యాదు చేశారు. జిల్లా గ్రం థాలయ సంస్థ చైర్మన్‌ పీరుకట్ల విఠల్‌రావు, నాయకులు గాలి కృష్ణారావు, మల్లా శ్రీనివాస్‌, గురిటి సూర్యనారాయణ, బడ్డ నాగరాజు, టంకాల రవిశంకర్‌ గుప్తా, ఎం.నరేంద్ర, నిరంజన్‌, కొత్త సత్యం, సవర రాంబాబు, గోళ్ల చంద్రరావు ఉన్నారు.

వజ్రపుకొత్తూరు, జనవరి 28(ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యే గౌతు శిరీషపై అసత్య ప్రచారం చేసిన ఓ చానల్‌ రిపోర్టర్‌పై చర్యలు తీసుకోవాలని మండల టీడీపీ నాయకులు కోరారు. బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సూరాడ మోహనరావు, కర్ని రమణ, అగ్నికులక్షత్రియ కార్పొరేషన్‌ డైరెక్టరు పుచ్చ ఈశ్వరరావు, మాజీ ఎంిపీపీ గొరకల వసంతరావు, జిల్లా కార్యదర్శి పోతనపల్లి సాంబమూర్తి తదితరులు ఉన్నారు.

హరిపురం, జనవరి 28(ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యే గౌతు శిరీషపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ప్రచారం చేసిన ఓ చానెల్‌ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు కోరారు. ఈ మేరకు మందస పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్‌కు ఫిర్యాదు చేవారు. టీడీపీ మండల అధ్యక్షులు బావన దుర్యోధన, నాయకులు రట్టి లింగరాజులు, సాలిన మాధవరావు, అగ్గున్న జయరాజు, మహేష్‌, తారక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 29 , 2026 | 12:14 AM