దాడిచేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోండి
ABN , Publish Date - Mar 05 , 2026 | 11:50 PM
కోమర్తి సచివాలయంలో సర్వేయర్‌గా విధులు నిర్వహిస్తున్న పి.గోపాలరావుపై అదే గ్రామానికి చెందిన కింజరాపు ప్రసాదరావు దాడి చేయడం తగదని, వెంటనే పోలీసులు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ ఉద్యోగుల సంఘ నాయకులు డిమాండ్ చేశారు.
పోలీసు స్టేషన్ ఎదుట రెవెన్యూ ఉద్యోగుల నిరసన
నరసన్నపేట, మార్చి 5(ఆంధ్రజ్యోతి): కోమర్తి సచివాలయంలో సర్వేయర్‌గా విధులు నిర్వహిస్తున్న పి.గోపాలరావుపై అదే గ్రామానికి చెందిన కింజరాపు ప్రసాదరావు దాడి చేయడం తగదని, వెంటనే పోలీసులు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ ఉద్యోగుల సంఘ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక పోలీసు స్టేషన్ ఎదుట వీఆర్వోలు, సర్వేర్లు, రెవెన్యూ సిబ్బంది ఆందోళన చేపట్టారు. ప్రసాదరావుపై కేసు నమోదు చేసి వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వీఆర్వో, రెవెన్యూ సంఘాల నాయకులు అప్పలనాయుడు, పి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.