ప్రభుత్వం దృష్టికి తహసీల్దార్ తప్పుడు నివేదిక
ABN , Publish Date - Sep 29 , 2026 | 11:53 PM
ఎచ్చెర్ల తహసీల్దార్ తప్పుడు నివేదిక, అధికార దుర్వినియోగంపై ప్రభుత్వం, ప్రజాప్రతి నిధు లు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. ‘రోల్‌బ్యాక్ 22ఎ’లో భాగంగా ఫరీదుపేట గ్రామ పరిధిలోని హైవేకి ఆనుకుని ఉన్న సర్వే నంబర్ 528-34లోని 75 సెంట్ల స్థలాన్ని ఆయన మంగళవారం పరిశీలించారు.
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు
ఎచ్చెర్ల రూరల్, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): ఎచ్చెర్ల తహసీల్దార్ తప్పుడు నివేదిక, అధికార దుర్వినియోగంపై ప్రభుత్వం, ప్రజాప్రతి నిధు లు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. ‘రోల్‌బ్యాక్ 22ఎ’లో భాగంగా ఫరీదుపేట గ్రామ పరిధిలోని హైవేకి ఆనుకుని ఉన్న సర్వే నంబర్ 528-34లోని 75 సెంట్ల స్థలాన్ని ఆయన మంగళవారం పరిశీలించారు. తమ్మినేని చెల్లన్న కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆయన సదరు ప్రాంతాన్ని పరిశీలిం చి వివరాలు తెలుసుకున్నారు. 1977లో తమ్మినేని చెల్లన్నకు అసైన్డ్ ల్యాండ్ 75 సెంట్లను అప్పటి ప్రభుత్వం అందజేసిందని, అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆ స్థలంలో ఉన్న గోతులను స్థానిక బీజేపీ నాయ కుడు గ్రావెల్‌తో కప్పి ఆక్రమణకు సిద్ధమయ్యాడని, దీనిపై తమ్మినేని అజయ్‌కుమార్, కుటుంబ సభ్యులు పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారన్నారు. అయితే సదరు స్థలంపై తహసీల్దార్ తప్పుడు నివేదిక తయారు చేశారని ఆరోపించారు. ఒకపక్క జర్నలిస్టులు, స్థానికులకు స్థలం కేటాయించాలని తీర్మానాలున్నాయని పేర్కొంటూనే మరో పక్క పట్టా రద్దు చేసి 22ఎగా మార్చారని ఆరోపించారు. పట్టా రద్దు చేసినట్లు నోటీసులిచ్చారని, తప్పుడు నివేదికలతో ఈ పట్టా ఎలా రద్దు చేశారని బాధితులు ఆర్డీవో కోర్టులో, హైకోర్టులో తహసీల్దార్‌పై చర్యకు అప్పీల్ చేశారన్నారు. వీరి పోరాటానికి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. సదరు బీజేపీ నేతతో ప్రాణహాని ఉందని బాధితులు తెలిపా రని, వీరికి రక్షణకు ఎచ్చెర్ల పోలీస్‌స్టేషన్‌లో వినతిపత్రం ఇస్తామన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో 7.50 లక్షల ఎకరాల భూమిని 22ఎ బాధితు లకు నాలుగు వారాల్లోగా ప్రభుత్వం అప్పగిస్తామని చెప్పిందని, వారం రోజులే గడువు ఉందన్నారు. కార్యక్రమంలో సెంట్రల్ ఫర్ లిబర్టీ వలంటరీ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు చక్రవర్తి ఉన్నారు.