Share News

లోక్‌ అదాలత్‌తో సత్వర న్యాయం

ABN , Publish Date - Sep 12 , 2026 | 10:59 PM

: లోక్‌అదాలత్‌తో సత్వర న్యాయం లభిస్తుందని, తద్వారా కక్షిదారులకు విలువైన కాలం, డబ్బులు ఆదా అవుతుందని పలాస జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి యు.మాధురి తెలిపారు.

 లోక్‌ అదాలత్‌తో సత్వర న్యాయం
పలాస:లోక్‌అదాలత్‌ నిర్వహిస్తున్న న్యాయాధికారి మాధురి

- జిల్లాలోని పలు కోర్టుల్లో నిర్వహణ

- కేసులు పరిష్కరించిన న్యాయాధికారులు

పలాస, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): లోక్‌అదాలత్‌తో సత్వర న్యాయం లభిస్తుందని, తద్వారా కక్షిదారులకు విలువైన కాలం, డబ్బులు ఆదా అవుతుందని పలాస జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి యు.మాధురి తెలిపారు. శనివారం స్థానిక కోర్టు ఆవరణలో నిర్వహించిన లోక్‌అదాలత్‌లో 921 కేసులను పరిష్కరించారు. ఇందులో 3 సివిల్‌ కేసులు, 56 క్రిమినల్‌, 21 ఎక్సైజ్‌, 10 చెక్‌బౌన్స్‌, 823 ప్రాపర్టీ, 7 మనోవర్తి కేసులు ఉన్నాయి. లోక్‌అదాలత్‌లను వినియోగించుకొని న్యాయం పొం దాలని ఆమె కోరారు. కార్యక్రమంలో న్యాయవాదులు ఎన్‌.విశ్వేశ్వరరావు, వై.హేమకుమార్‌ పాల్గొన్నారు.

టెక్కలిలో 668 కేసులు పరిష్కారం..

టెక్కలి, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): స్థానిక కోర్టు సముదాయాల పరిధిలో శనివారం జరిగిన జాతీయ లోక్‌అదాలత్‌లో 668 కేసులు పరి ష్కారమైనట్లు ప్రిన్సిపల్‌ సివిల్‌ న్యాయాధికారి ఆర్‌.శాంతిశ్రీ, జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి యు.మాధురి తెలిపారు. ఇందులో సివిల్‌ కేసులు మూడు, క్రిమినల్‌ 36, ఎక్సైజ్‌ 20, ఓపెన్‌ డ్రింకింగ్‌ మూడు, క్రిమినల్‌ కేసుల చలానా రూపంలో 20, పేకాట రెండు, ట్రాఫిక్‌ చలానాలు 220, న్యూసెన్స్‌ 364, మెంటినెన్స్‌ కేసులు రెండు, డీవీసీ కేసు ఒకటి ఉన్నాయని తెలిపారు. ఈ కేసులకు సంబంధించి రూ.3,40,560 చెల్లింపులు జరిగాయని అన్నారు. కార్యక్రమంలో బార్‌అసోసియేషన్‌ అధ్యక్షుడు పినకాన అజయ్‌కుమార్‌, ఏజీపీ దివ్వల వివేకానంద, ఏపీపీ సుఽధారాణి, అదాలత్‌ సభ్యులు మధుబాబు, ధర్మరాజు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

నరసన్నపేటలో 597..

నరసన్నపేట, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): కేసులు సత్వర పరిష్కారానికి లోక్‌అదాలత్‌ సరైన వేదిక అని స్థానిక సివిల్‌ కోర్టు న్యాయాధికారి వాణి అన్నారు. శనివారం స్థానిక కోర్టు ఆవరణలో జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. మొత్తం 597 కేసులను పరిష్కరించారు. ఇందులో 517 ఎస్‌టీసీ కేసులకు సంబంధించి రూ.5.49 లక్షల జరిమానా విధించినట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

కోటబొమ్మాళిలో 563..

కోటబొమ్మాళి, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): స్థానిక జూనియర్‌ సివిల్‌ కోర్టులో జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి ఎం.రోషిణి ఆధ్వర్యంలో శనివారం లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. 563 కేసులను పరిష్కరించారు. ఇందులో ఒక సివిల్‌ కేసు, 12 క్రిమినల్‌, ప్లీబార్లయినింగ్‌ ద్వారా రాజీ అయిన కేసులు-28, ఎక్సైజ్‌ కేసులు-15, ఆడ్మిషన్‌ 498, మనోవర్తి మూడు, గృహహింస కేసు ఒకటి ఉన్నాయన్నారు. కార్యక్రమంలో లోక్‌ అదాలత్‌ సభ్యులు డి. నరసింహమూర్తి, పల్లి వాసుదేవరావు, న్యాయ వాదుల సంఘం అధ్యక్షుడు ఎల్‌.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

పొందూరులో 618..

పొందూరు, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): స్థానిక జూనియర్‌ సివిల్‌ కోర్టులో శనివారం న్యాయాధికారి బి.జ్యోత్స్న జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా 618 కేసులు పరిష్కారమయ్యాయని ఆమె తెలిపారు. పొందూరు, జి.సిగడాం పరిధిలో 11 సివిల్‌, 600 క్రిమినల్‌, 4 బ్యాంకు రికవరీ, 3 బీఎస్‌ఎన్‌ఎల్‌ కేసులు పరిష్కరిం చిన ట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పొందూరు, జి.సిగడాం ఎకై్ౖసజ్‌, పోలీసు అధికారులు, న్యాయవాదులు ఎం.రాము తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 12 , 2026 | 10:59 PM