Share News

అరసవల్లి క్షేత్రం పాలకమండలి ప్రమాణ స్వీకారం

ABN , Publish Date - Sep 05 , 2026 | 11:46 PM

అరసవల్లి శ్రీసూర్య నారాయణస్వామి దేవస్థానం నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారం శనివారం ఆలయంలో నిర్వహించారు.

అరసవల్లి క్షేత్రం పాలకమండలి ప్రమాణ స్వీకారం
ప్రమాణస్వీకారం చేస్తున్న పాలకమండలి సభ్యులు

శ్రీకాకుళం అర్బన్‌, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): అరసవల్లి శ్రీసూర్య నారాయణస్వామి దేవస్థానం నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారం శనివారం ఆలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్‌ మాట్లాడుతూ.. క్షేత్రం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఆలయ పుష్కరిణి ఆధునికీకరణ పనులు రూ.4 కోట్లతో చేపడుతున్నామని, మాస్టర్‌ ప్లాన్‌ ద్వారా అరసవల్లి క్షేత్రాన్ని ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు. ప్రసాద్‌ పథకం ద్వారా మరిన్ని నిధులు సమీకరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. నూతన పాలక మండలిలో అన్ని వర్గాలతో పాటు మహిళలకు 50 శాతం అవ కాశం కల్పించామన్నారు. ఆలయ పురోభివృద్ధికి పాలకమండలి కృషి చే యాలన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి గౌతు శ్యామసుందర శివాజీ, ఈవో కేఎన్‌వీడీవీ ప్రసాద్‌, ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకర శర్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 05 , 2026 | 11:46 PM