‘స్వర్ణాంధ్ర’ను స్ఫూర్తిగా తీసుకోవాలి
ABN , Publish Date - May 18 , 2026 | 12:06 AM
నరసన్నపేటలో ముఖ్యమంత్రి చంద్ర బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని పట్టణ ప్రజలు ఆదర్శంగా తీసుకొని పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కోరారు.
నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి
నరసన్నపేట, మే 17(ఆంధ్రజ్యోతి): నరసన్నపేటలో ముఖ్యమంత్రి చంద్ర బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని పట్టణ ప్రజలు ఆదర్శంగా తీసుకొని పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కోరారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేక రులతో మాట్లాడుతూ.. ఇంటిని ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకుంటారో.. ఆ విధంగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. సేకరించిన చెత్త నుంచి సంపద సృష్టించి పట్టణాభివృద్ధికి సహకరించాలని కోరారు. రాజులు చెరువు అభివృద్ధి, కాలేజీ రోడ్డు వెడల్పు, సెంట్రల్‌లైటింగ్ ఏర్పాటు తదితర పనులు చేపట్టనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కాళింగ కార్పొరేషన్ చైర్మన్ రోణంకి కృష్ణంనాయుడు, పొందరి కార్పొరేషన్ చైర్మన్ దామోదర నర్సింహాలు, నాయకులు గొద్దు చిట్టిబాబు, అడపా చంద్రశేఖర్, సూరపు నారాయణదాసు, కింజరాపు రామారావు తదితరులు పాల్గొన్నారు.