Share News

స్వామీ.. వైసీపీకి బుద్ధి ప్రసాదించు

ABN , Publish Date - Feb 07 , 2026 | 11:20 PM

తిరుమల వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వైసీపీ నేతలకు బుద్ధిని ప్రసాదించాలని పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ వెంకన్న స్వామిని వేడుకున్నారు.

స్వామీ.. వైసీపీకి బుద్ధి ప్రసాదించు
ప్రాయశ్చిత్త దీక్షలో కూర్చున్న ఎమ్మెల్యే రవికుమార్‌ తదితరులు

ఆమదాలవలస, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): తిరుమల వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వైసీపీ నేతలకు బుద్ధిని ప్రసా దించాలని పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ వెంకన్న స్వామిని వేడుకున్నారు. లడ్డూ కల్తీ వ్యవహారంపై జనసేన ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని ఓవర్‌ బ్రిడ్జి డౌన్‌లో ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో ఎమ్మెల్యే పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌తో పాటు సీబీఐ విచారణలో కూడా వైసీపీ ప్రభుత్వ ఐదేళ్లలో లడ్డూ తయారీకి వినియో గించిన నెయ్యి నాణ్యత కోల్పోయి కల్తీ జరిగినట్టు గుర్తించారన్నారు. అయినప్పటికీ వైసీపీ నేతలు తప్పు డు ప్రచా రాలు చేస్తున్నారని విమర్శించారు. శ్రీవారి ప్రసాదం పవిత్రతను కాపాడడం ప్రభుత్వాల బాధ్యత అని అన్నారు. విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జనసేన నియో జకవర్గ కన్వీనర్‌ పేడాడ రామ్మోహన్‌ మాట్లాడుతూ.. భక్తుల ఆవేదనకు ప్రతీకగా ఈ ప్రాయశ్చిత దీక్ష చేపట్టామన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు మొదలవలస రమేష్‌, మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్‌, మునిసిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ తమ్మినేని గీతా విద్యాసాగర్‌, కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2026 | 11:20 PM