Share News

స్వచ్ఛరథం ప్రాజెక్టు విజయవంతం

ABN , Publish Date - May 09 , 2026 | 12:15 AM

: నిరుపయోగంగా ఉన్న ప్లాస్టిక్‌, పాత పేపర్లు ఇతర వస్తువులను సేకరించి వాటికి బదులుగా నిత్యావసరాలను అందించేందుకు ఉద్దేశించిన ‘స్వచ్ఛరథం’ ప్రాజెక్టు విజయవంతం అయిందని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ బి.హర్ష అన్నారు.

స్వచ్ఛరథం ప్రాజెక్టు విజయవంతం
స్వచ్ఛరథం పనితీరును పరిశీలిస్తున్న అసిస్టెంట్‌ కమిషనర్‌ హర్ష

పంచాయతీరాజ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ హర్ష

బూర్జ, మే 8 (ఆంధ్రజ్యోతి): నిరుపయోగంగా ఉన్న ప్లాస్టిక్‌, పాత పేపర్లు ఇతర వస్తువులను సేకరించి వాటికి బదులుగా నిత్యావసరాలను అందించేందుకు ఉద్దేశించిన ‘స్వచ్ఛరథం’ ప్రాజెక్టు విజయవంతం అయిందని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ బి.హర్ష అన్నారు. లక్కుపురం, పాలవలస సచివాలయం పరిధిలో ఈ ప్రాజెక్టు పనితీరును శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ.. ఇళ్లలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను సంపదగా మార్చే ఉద్దేశంతో దీనిని ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని, తద్వారా గ్రామాలు పరిశుభ్రంగా ఉండడంతో పాటు నిత్యావసర వస్తువులు పొందవచ్చన్నారు. దీని సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ వాహన సిబ్బంది పాత ఇనుము, పేపర్లు, పుస్తకాలు, అట్ట పెట్టెలు, ప్లాస్టిక్‌ బాటిళ్లు, స్టీల్‌ వస్తువులను సేకరించి వాటికి బదులుగా ఉప్పు, పప్పు, చింతపండు, సబ్బులు వంటి నిత్యా వసర వస్తువులు అందజేస్తారన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో తిరుపతి రావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2026 | 12:15 AM