నైపుణ్యంతో స్థిరమైన అభివృద్ధి: రవికుమార్
ABN , Publish Date - May 06 , 2026 | 12:12 AM
నైపుణ్యం పెం పొందించు కోవ డం ద్వారా స్థిర మైన అభివృద్ధి, పొంది ఉపాధి అవకాశాలు పొందవచ్చని రాష్ట్ర పీయూసీ చైర్మన్, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు.
ఎచ్చెర్ల, మే 5 (ఆంఽధ్రజ్యోతి) నైపుణ్యం పెం పొందించు కోవ డం ద్వారా స్థిర మైన అభివృద్ధి, పొంది ఉపాధి అవకాశాలు పొందవచ్చని రాష్ట్ర పీయూసీ చైర్మన్, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. ఎచ్చెర్ల యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో 45 రోజుల పాటు శిక్షణ పొందిన యువతకు మంగళవారం ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమకు ఆసక్తి ఉన్న రంగంలో నైపుణ్యం సంపాదించుకుని ఉపాధి పొందాలన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు, మూలపేట పోర్టు వంటి ప్రాజెక్టుల్లో ఉద్యోగావకాశాలు అంది పుచ్చుకునేలా శిక్షణ ఇవ్వా లని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో ఎల్‌డీఎం పి.శ్రీనివా సరావు, శిక్షణ సంస్థ డైరెక్టర్ ఎన్.రాంజీ తదితరులు పాల్గొన్నారు.