ఏసీబీకి చిక్కిన మాజీ ఇన్‌స్పెక్టర్‌పై సస్పెన్షన్ ఎత్తివేత
ABN , Publish Date - Jun 01 , 2026 | 11:55 PM
పలాసలో లీగల్ మెట్రాలజీ ఇన్ స్పెక్టర్‌గా పనిచేస్తూ ఏసీబీకి పట్టుబడిని తంగెళ్ల శ్రీధర్ సస్పెన్షన్‌ను ప్రభు త్వం ఎత్తివేసింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ ఎక్స్-అఫీషియో కార్య దర్శి కె.కన్నబాబు సోమవారం జీవోఆర్టీ 25ని విడుదల చేశారు.
పలాస లీగల్ మెట్రాలజీ కేసులో ప్రభుత్వం ఉత్తర్వులు
శ్రీకాకుళం, జూన్ 1(ఆంధ్రజ్యోతి): పలాసలో లీగల్ మెట్రాలజీ ఇన్ స్పెక్టర్‌గా పనిచేస్తూ ఏసీబీకి పట్టుబడిని తంగెళ్ల శ్రీధర్ సస్పెన్షన్‌ను ప్రభు త్వం ఎత్తివేసింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ ఎక్స్-అఫీషియో కార్య దర్శి కె.కన్నబాబు సోమవారం జీవోఆర్టీ 25ని విడుదల చేశారు. వివరాలి లా ఉన్నాయి.. నర్సుపల్లి సత్యనారాయణ నుంచి అధికారిక పనుల కోసం రూ.1,78,000 లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా 2025 మే 22న శ్రీధర్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీంతో ఆయ నను ప్రభుత్వం అప్పట్లో సస్పెండ్ చేసింది. మే 23న అరెస్టయిన ఆయన ను విశాఖపట్నంలోని ఏసీబీ కోర్టు రిమాండ్‌కు తరలించింది. మరోవైపు విధుల్లో నిర్లక్ష్యం, ఉన్నతాధికారుల ఆదేశాల ధిక్కరణ కారణంగా 2025 నవంబరు 30న ఆయనను ‘సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్’గా డిమోట్ చేశారు. ఇదిలా ఉండగా సస్పెన్షన్ కాల వ్యవధి తగ్గింపు, సమీక్షకు సం బంధించి జారీ అయిన జీవో నెంబర్ 22 ఆధారంగా ప్రభుత్వం శ్రీధర్ కేసును సమీక్షించింది. ఆయనపై ఉన్న క్రమశిక్షణ, క్రిమినల్ కేసులు యథా తథంగా కొనసాగుతాయని స్పష్టం చేస్తూనే సస్పెన్షన్‌ను రద్దు చేసింది. ఆయనను తిరిగి విధుల్లోకి తీసుకుంటూ ప్రాధాన్యం లేని (నాన్-ఫోకల్) పోస్టులో దూరప్రాంతంలో నియమించాలని లీగల్ మెట్రాలజీ కంట్రోలర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.