Share News

సర్వేలు పకడ్బందీగా చేయాలి

ABN , Publish Date - May 29 , 2026 | 11:43 PM

క్షేత్రస్థాయిలో సర్వేలన్నీ పకడ్బందీగా చేయాలని మండల గ్రామ, వార్డు సచి వాలయాల అధికారి బి.కృష్ణారావు కోరారు.

సర్వేలు పకడ్బందీగా చేయాలి
బడ్డుమర్రి సచివాలయంలో రికార్డులు పరిశీలిస్తున్న కృష్ణారావు

  • ఫమండల గ్రామ, వార్డు సచివాలయాల అధికారి కృష్ణారావు

పాతపట్నం రూరల్‌, మే 29(ఆంధ్రజ్యోతి): క్షేత్రస్థాయిలో సర్వేలన్నీ పకడ్బందీగా చేయాలని మండల గ్రామ, వార్డు సచి వాలయాల అధికారి బి.కృష్ణారావు కోరారు. శుక్రవారం మండలంలోని బడ్డుమర్రి గ్రామ సచివాలయాన్ని తనిఖీచేశారు. ఈ సందర్భంగా సచివాలయంలోని రికార్డులు, సిబ్బంది హాజరును పరిశీలించారు. సచివాలయం పరిధిలో గల పెండింగ్‌లో ఉన్న వివిధ సర్వేల పురోగతిపై సిబ్బందితో సమీక్షిం చారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రజలకు సకాలంలో అందాలంటే సర్వేలు కీలకమని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న యూఎఫ్‌ఎస్‌ సర్వేలన్నీ ఎటువంటి జాప్యం లేకుండా వేగవంతం చేయాలని సిబ్బందికి సూచించారు. సచివాలయ సేవలను ప్రజలకు మరింత చేరువచేయాలని ఆదేశిచారు.

: పాతపటోనం రరల్‌ 1

Updated Date - May 29 , 2026 | 11:43 PM