Share News

గంజాయి రవాణాపై నిఘా

ABN , Publish Date - Jan 10 , 2026 | 12:19 AM

ఆంధ్ర- ఒడిశా సరిహద్దు నుంచి గంజాయి రవాణా కా కుండా గట్టి నిఘా పెట్టామని ఎస్పీ కేవీ మహేశ్వ రరెడ్డి తెలిపారు.

 గంజాయి రవాణాపై నిఘా
మాట్లాడుతున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి

  • ఎస్పీ మహేశ్వరరెడ్డి

మెళియాపుట్టి, జనవరి 9(ఆంధ్రజ్యోతి): ఆంధ్ర- ఒడిశా సరిహద్దు నుంచి గంజాయి రవాణా కా కుండా గట్టి నిఘా పెట్టామని ఎస్పీ కేవీ మహేశ్వ రరెడ్డి తెలిపారు. శుక్రవారం మెళియాపుట్టి పోలీసు స్టేష న్‌లో వార్షిక తనిఖీ నిర్వహించారు. అనంత రం ఆయన విలేకరులతో మాట్లాడారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంచేందుకు అనేక కార్య క్రమలు నిర్వహించి చైతన్యం తెస్తున్నట్టు తెలిపారు. గ్రానైట్‌ క్వారీల్లో అనుమతులు లేకుండా బ్లా స్టింగ్‌ చేపడితే చర్యలు తప్పవని హెచ్చ రించారు. క్వారీలో సౌకర్యలు కల్పించిన తర్వాతే పనులు చేసుకోవడానికి అనుమతులు ఇవ్వడం జరుగుతుం దన్నారు. ప్రస్తుతం అధికంగా కిడ్నాప్‌ కేసులు నమోదు అవుతున్నాయని, వీటిపై ప్రత్యే క దృష్టి సారిస్తున్నట్టు తెలిపారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. పాతపట్నం సీఐ సన్యాసినాయుడు, ఎస్‌ఐ పిన్నింటి రమేష్‌బాబు, తదితరులు ఉన్నారు.

అప్రమత్తంగా ఉండాలి

పాతపట్నం, జనవరి 9(ఆంధ్రజ్యోతి): నేర నియంత్రణలో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ మహేశ్వరరెడ్డి సూచించారు. స్థానిక సర్కిల్‌ కార్యాలయంలో శుక్రవారం వార్షిక తనిఖీలు నిర్వహించారు. రికార్డులు పరిశీలించి, గ్రేవ్‌ కేసుల దర్యాప్తపై ఆరా తీశారు. అలాగే డ్రంకెన్‌ డ్రైవ్‌, అసాంఘిక కార్యక్రమాల నియంత్రణపై కఠినంగా వ్యవహరించాలన్నారు. సీఐ ఎన్‌ సన్యాసినాయుడు ఎస్‌ఐ కె.మధుసూదనరావు ఉన్నారు.

Updated Date - Jan 10 , 2026 | 12:19 AM