Share News

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై నిఘా

ABN , Publish Date - Nov 27 , 2026 | 12:48 AM

జిల్లాలో జరుగుతున్న తొలి దశ ఎన్నికల నేపధ్యంలో నేత్ర యాప్‌ ద్వారా పోలీస్‌ సిబ్బంది లైవ్‌ లొకేషన్లను ట్రాక్‌ చేస్తూ సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటుచేశారు.

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై నిఘా
ఆమదాలవలస: ఎంపీడీవోకార్యాలయం సమీపంలో పోలింగ్‌ కేంద్రం పరిశీలించేందుకు వెళ్తున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి

శ్రీకాకుళం క్రైం, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో జరుగుతున్న తొలి దశ ఎన్నికల నేపధ్యంలో నేత్ర యాప్‌ ద్వారా పోలీస్‌ సిబ్బంది లైవ్‌ లొకేషన్లను ట్రాక్‌ చేస్తూ సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటుచేశారు. ఈమేరకు గురువారం మహేశ్వరరెడ్డి కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి ఎన్నికల పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించా రు. అత్యవసర పరిస్థితుల్లో ఎస్‌వోఎస్‌ ద్వారా సమాచారం అందగానే నిమిషాల వ్యవధిలోనే పోలీస్‌బృందాలు స్పందించేలా చర్యలు చేపట్టారు. ఎన్నికల సమయంలో శాంతిభ ద్రతలకు విఘాగం కలిగించే వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. కార్యక్రమంలో ఎల్‌క్షన్‌ సెల్‌ సిఐ అప్పారావు, కమ్యూనికేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

పోలింగ కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్ల తనిఖీ

ఆమదాలవలస/శ్రీకాకుళం క్రైం, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఆమదాలవలస మునిసిపాలిటీ పరిధిలోని 10, 22, 24 పోలింగ్‌ కేం ద్రాలను గురువారం ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పరిశీలించారు. నందిగిరి పేట, చింతాడ, బొడ్డేపల్లిపల్లి, పాత ఆమదాలవలస, కృష్ణాపురం తదితర ప్రాంతాల్లోని హైపర్‌ సెన్సిటివ్‌, సెన్సిటివ్‌ సహా పలు పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు చేపట్టిన భద్రతాఏర్పాట్లను తనిఖీచేశారు. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటుహక్కు వినియోగించేలా చర్యలు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. పోలింగ్‌సరళి, కేంద్రాల వద్ద పరి స్థితులను సీఐ సన్యాసినాయుడును అడిగితెలుసుకున్నారు. పోలింగ్‌ కేం ద్రాల నిర్వహణకు సంబంధించిన వివరాలపై అధికారులతో చర్చించారు.

Updated Date - Nov 27 , 2026 | 12:48 AM