Share News

కిరాణా దుకాణాల్లో ఆకస్మిక తనిఖీ

ABN , Publish Date - Nov 19 , 2026 | 12:06 AM

జిల్లాలో విజిలెన్స్‌, లీగల్‌ మెట్రాలజీ, జీఎస్టీ అధికారులు బుధవారం కిరాణా దుకాణాలు, సూపర్‌ మార్కెట్లు, రైస్‌ మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

కిరాణా దుకాణాల్లో ఆకస్మిక తనిఖీ

రూ.4.61 లక్షల వస్తువుల స్వాధీనం

రూ.60 వేల జరిమానా

అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు: వివేకానంద

శ్రీకాకుళం అర్బన్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో విజిలెన్స్‌, లీగల్‌ మెట్రాలజీ, జీఎస్టీ అధికారులు బుధవారం కిరాణా దుకాణాలు, సూపర్‌ మార్కెట్లు, రైస్‌ మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నిబంధ నలు ఉల్లం ఘించిన వారిపై ఆరు కేసులు నమోదు చేసి రూ.4.61 లక్షలు విలు వైన నిత్యావసర సరు కులను స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని ఎంజీఎం సూపర్‌మార్కెట్‌, కార్తికేయ ట్రేడర్స్‌, శ్రీవిష్ణు సహస్ర రైతు సూపర్‌ మార్కెట్‌ పన్ను ఇన్వాయిస్‌ జారీ చేయనందుకు జీఎస్టీ అధికా రులు రూ.60 వేలు జరిమానా విధిం చారు. ఈ తనిఖీల్లో 15 క్వింటాళ్ల కందిపప్పు, 15 క్వింటాళ్ల పెసలు, 51.05 క్వింటాళ్ల బియ్యం, 60.60 క్వింటాళ్ల ఽధాన్యం స్వాధీనం చేసు కున్నారు. అధిక ధరలకు సరుకులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుం టామని ప్రాంతీయ విజిలెన్స్‌ అధికారి వివేకానంద హెచ్చరించారు. విజిలెన్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సతీష్‌ కుమార్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ రామారావు, లీగల్‌ మెట్రాలజీ అధికారి బల రామకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Nov 19 , 2026 | 12:06 AM