Share News

స్వామి సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి

ABN , Publish Date - Feb 16 , 2026 | 12:17 AM

Supreme Court judge visited arasavalli అరసవల్లిలో శ్రీ సూర్యనారాయణ స్వామిని, శ్రీకూర్మంలో కూర్మనాథ స్వామిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌ ఆదివా రం దర్శించుకున్నారు.

స్వామి సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి
అరసవల్లి : సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌కి జ్ఞాపికను అందిస్తున్న ఈవో ప్రసాద్‌

అరసవల్లి/ గార ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి ): అరసవల్లిలో శ్రీ సూర్యనారాయణ స్వామిని, శ్రీకూర్మంలో కూర్మనాథ స్వామిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌ ఆదివా రం దర్శించుకున్నారు. అరసవల్లిలో ఆయనకు ఈవో కేఎన్‌వీడీవీ ప్రసాద్‌, ప్రధానార్చకులు శంకరశర్మ స్వాగతం పలుకగా, అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. ఆదిత్యుడి ప్రసాదాలు, జ్ఙాపికను ఈవో అందజేశారు. శ్రీకూర్మంలో స్వామి చిత్రపటాన్ని అర్చకులు చామర్ల మురళీకృష్ణ అందజేశారు. కార్యక్ర మంలో జిల్లా న్యాయాధికారి జునైద్‌ అహ్మద్‌ మౌలానా, న్యాయాధికారి వివేకానంద శ్రీని వాస్‌, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ న్యాయాధి కారి అనురాగ్‌, అర్చకులు ఇప్పిలి రంజిత్‌ శర్మ, ఫణీంద్రశర్మ పాల్గొన్నారు.

Updated Date - Feb 16 , 2026 | 12:18 AM