ఉద్యమాలను అణచివేయడం సరికాదు
ABN , Publish Date - Oct 17 , 2026 | 12:28 AM
ప్రజాస్వామ్యంలో ఉద్యమా లు ఒక భాగమని, వీటిని అణచి వేసే ధోరణిలో పనిచేయడం సరికాదని జనవిజ్ఞాన వేదిక వ్యవస్థాపకుడు డాక్టర్ బ్రహ్మారెడ్డి అన్నారు.
జేవీవీ వ్యవస్థాపకుడు డాక్టర్ బ్రహ్మారెడ్డి
పాత శ్రీకాకుళం అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్యంలో ఉద్యమా లు ఒక భాగమని, వీటిని అణచి వేసే ధోరణిలో పనిచేయడం సరికాదని జనవిజ్ఞాన వేదిక వ్యవస్థాపకుడు డాక్టర్ బ్రహ్మారెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం జడ్పీ గెస్ట్హౌస్లో ఆయన విలేకరులతో మాట్లాడు తూ.. దేశంలో క్రమక్రమంగా ప్రజాస్వామ్యం బలహీనపడుతోందని, దానిని కాపాడు కోవాల్సిన బాధ్యత ప్రజలదేనన్నారు. ‘సర్’ పేరుతో ఓటర్లను పెద్ద ఎత్తున తొలగించడం అన్యాయమన్నారు. సీఈసీని తొలగించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంటే దానిని అణచివేయడం దుర్మార్గమన్నారు. అనంతరం ‘ఓటును అమ్ముకోవద్దు’ అంటూ రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జేవీవీ జాతీయ కార్యదర్శి కృష్ణారావు, జిల్లా బాధ్యులు డాక్టర్ అరవింద్, చిన్నారావు, పాపారావు తదితరులు పాల్గొన్నారు.