ఆపదలో మహిళలకు అండగా..
ABN , Publish Date - Mar 09 , 2026 | 12:33 AM
ఆపదలో ఉన్న మహిళలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.
మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
టెక్కలిలో వన్‌స్టాప్ కేంద్రం ప్రారంభం
టెక్కలి రూరల్, మార్చి 8(ఆంధ్రజ్యోతి): ఆపదలో ఉన్న మహిళలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. అదివారం టెక్కలిలోని జిల్లా ఆసుపత్రిలో వన్‌స్టాప్ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. మహిళల భద్రతకు రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఆపదలో ఉన్న మహిళలకు ఇకపై తక్షణమే సాయం అందు తుందన్నారు. ఈ కేంద్రం 24 గంటలూ పనిచేస్తుం దన్నారు. మహిళలందరికి ఒకే చోట వైద్యసేవలు, న్యాయ సేవలతోపాటు ప్రత్యేక కౌన్సిలింగ్ ఇవ్వను న్నట్టు తెలిపారు. మహిళలు ఎక్కడకు తిరగాల్సిన అవరసరం లేదని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళల ఉన్నతికి ఆలోచిస్తుంటారన్నారు. టెక్కలి ఆయుష్ ఆసుపత్రిని నిర్మించనున్నట్టు తెలిపారు. టెక్కలి జిల్లా ఆసుపత్రికి మరో రెండు రోజుల్లో కొత్త సిబ్బందిని నియమిస్తామన్నారు. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని సిబ్బందికి కోరారు. అనంతరం బాల్యవిహల విము క్తి ప్రచార రఽథం ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమం లో టెక్కలి ఆర్డీవో ఎం.కృష్టమూర్తి, ఆసుపత్రి సూపరింటెండెంట్ సూర్యారావు, ఐసీడీఎస్ పీడీ కె.రూపలత, టీడీపీ నాయకులు హరిప్రసాద్, బి.శేఖగిరావు తదితరులు పాల్గొన్నారు.