Share News

‘ఉద్యమానికి మద్దతివ్వండి’

ABN , Publish Date - Jun 28 , 2026 | 11:48 PM

సమస్యల పరిష్కారం కోసం జూలై 12న శ్రీకాకుళంలో నిర్వహించనున్న తొలి ఉద్యమ సన్నద్ధ సభ విజయవంతానికి మద్దతి వ్వాలని ఏపీజేఏసీ (అమ రావతి) జిల్లా చైర్మన్‌ బీవీవీఎన్‌ రాజు కోరారు.

‘ఉద్యమానికి మద్దతివ్వండి’
ఉద్యమ కార్యాచరణ సమావేశంలో పాల్గొన్న ఏపీజేఏసీ నేతలు

అరసవల్లి, జూన్‌ 28(ఆంధ్రజ్యోతి): సమస్యల పరిష్కారం కోసం జూలై 12న శ్రీకాకుళంలో నిర్వహించనున్న తొలి ఉద్యమ సన్నద్ధ సభ విజయవంతానికి మద్దతి వ్వాలని ఏపీజేఏసీ (అమ రావతి) జిల్లా చైర్మన్‌ బీవీవీఎన్‌ రాజు కోరారు. ఈ మేరకు ఆదివారం ఎన్జీవో హోంలో సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీజీవో జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం మాట్లాడుతూ.. ఉద్యో గుల న్యాయమైన డిమాండ్ల సాధనకు చేస్తున్న ఉద్యమ కార్యాచరణకు అందరూ సహకరించా లని కోరారు. అదే విధంగా రెవెన్యూ గెస్ట్‌ హౌస్‌లో ఆర్ట్‌, పీఈటీ, క్రాఫ్ట్‌, యూనిటీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సీహెచ్‌ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆ సంఘ సమావేశం నిర్వహించారు. 12వ తేదీ నిర్వహించనున్న ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అలాగే ఏపీ జేఏసీ అమరావతి శ్రీకాకుళం డివిజన్‌ సమా వేశంలో అన్ని మండల కార్యాలయాలు, గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఉద్యోగులందరినీ సమా యత్తం చేసేందుకు తీర్మానించారు. కార్యక్ర మంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయి వేణు, ఎస్‌వీరమణ, జి.అరుణకుమారి, సోనీ కిరణ్‌, దామోదరరావు, కిరణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 28 , 2026 | 11:48 PM