‘శ్రీముఖలింగేశ్వరాలయ అభివృద్ధికి తోడ్పడండి’
ABN , Publish Date - Jan 29 , 2026 | 12:09 AM
శ్రీముఖలింగేశ్వర దేవస్థానం నూతన పాలక వర్గం ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు.
నరసన్నపేట, జనవరి 28(ఆంధ్రజ్యోతి): శ్రీముఖలింగేశ్వర దేవస్థానం నూతన పాలక వర్గం ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. నూతన పాలక మండలి చైర్మన్ శివప్రసాద్ పాడితో పాటు సభ్యులు శ్రీముఖలింగంలో బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నెలకోసారి పాలకమండలితోను, గ్రామపెద్దలతోను సమావేశం ఏర్పాటు చేసి ఆలయ అభివృద్ధిపై చర్చించాలని ఈవో ఏడుకొండలుకు సూచించారు. మహాశివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని సూచించారు. పాలక మండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి... వారిని ఎమ్మెల్యే సత్కరించారు. అలాగే శ్రీముఖలింగేశ్వరస్వామిని ఎమ్మెల్యే రమణమూర్తి దర్శించుకున్నారు. అర్చకులు, అధికారులు స్వాగతం పలికి పూజలు చేశాయించారు. దేవదాయశాఖ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్‌బాబు, మండల టీడీపీ అధ్యక్షులు వెలమల రాజేంద్రనాయుడు, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు తర్ర బలరాం, అర్చకుల సంఘం అధ్యక్షులు ఎస్‌వీ చలం, చల్లవానిపేట, అల్లాడ సొసైటీ అధ్యక్షులు దుంగ స్వామిబాబు, వెలమల చంద్రభూషణరావు, టీడీపీ నాయకులు బగ్గు గోవిందరావు, దేవ, సర్పంచ్ టి.సతీష్‌కుమార్, ఎంపీటీసీ సభ్యుడు కె.హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.