పంటల మద్దతు ధరలు పెంచాలి
ABN , Publish Date - May 28 , 2026 | 11:30 PM
వ్యవసాయానికి పెరిగిన పెట్టుబడికి అనుగుణంగా పెంటలు మద్దతు ధరలు పెంచాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెలమల రమణ, మజ్జి రమన డిమాండ్ చేశారు.
రణస్థలం, మే 28 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయానికి పెరిగిన పెట్టుబడికి అనుగుణంగా పెంటలు మద్దతు ధరలు పెంచాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెలమల రమణ, మజ్జి రమన డిమాండ్ చేశారు. కొండములగాం గ్రామంలో ఏపీ కౌలు రైతుల సంఘం, అంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ పంటల మద్దతు ధరలు నిర్ణయించడంలో కేంద్ర ప్రభుత్వ మోసపూరిత వైఖరిని ఖండిస్తూ వ్యవసాయ పంటల మద్దతు ధరల జీవో కాపీలను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర 2400 ఉండగా కేవలం పది రూపాయలు పెంచి రూ.2410, వరికి క్వింటాకు రూ. 2441గా నిర్ణయించడం యావత్ భారత దేశ రైతులందరికి అన్యాయం చేయడమేనని చెప్పారు.