మొక్కజొన్నకు మద్దతు ధర
ABN , Publish Date - Mar 31 , 2026 | 12:34 AM
కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఇటీవల తీసు కువెళ్లి మొక్కజొన్నకు మద్దతు ధర కల్పించినట్లు వ్యవసాయశాఖ మంత్రి కింజరా పు అచ్చెన్నాయుడు తెలిపారు.
మెళియాపుట్టి, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఇటీవల తీసు కువెళ్లి మొక్కజొన్నకు మద్దతు ధర కల్పించినట్లు వ్యవసాయశాఖ మంత్రి కింజరా పు అచ్చెన్నాయుడు తెలిపారు. మొక్కజొన్న పంటకు మద్దతు ధర ప్రకటించడంతో కొసమాళ రైతులు సోమవారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో అచ్చెన్నాయుడును అభినందించారు. నాలుగేళ్లుగా మొక్కజొన్నపంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో నష్టపోయామని రైతులు ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎంజీఆర్ చొరవతో మహేంద్రతనయ ఎత్తిపోతల పఽథకానికి నిధులు మంజూరుకు కృషిచేసినట్లు తెలిపారు. కోసమాళలో రహదారులకు మంత్రి రూ.కోటి మంజూరు చేసినట్లు గ్రామస్థులు చెప్పారు. కార్యక్రమంలో మండల టీడీపీ ప్రధానకార్యదర్శి బోచ్చుప్రసాదరావు, సిరిపురం వెంకట్రావ్ పాల్గొన్నారు.