Share News

క్లోరినేషన్‌ తర్వాతే నీటిని సరఫరా చేయండి

ABN , Publish Date - Feb 28 , 2026 | 12:30 AM

క్లోరినేషన్‌ చేసిన తర్వాతే రక్షి త నీటి పథకాల ద్వారా ప్రజలకు తా గునీరు అందించా లని జిల్లా పంచా యతీ అధికారి ఆర్‌.గోపిబాల సిబ్బందికి ఆదేశించారు.

క్లోరినేషన్‌ తర్వాతే నీటిని సరఫరా చేయండి
హిరమండలం: నీటి నాణ్యతను పరిశీలిస్తున్న అధికారులు

  • జిల్లా పంచాయతీ అధికారి గోపిబాల

హిరమండలం, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): క్లోరినేషన్‌ చేసిన తర్వాతే రక్షి త నీటి పథకాల ద్వారా ప్రజలకు తా గునీరు అందించా లని జిల్లా పంచా యతీ అధికారి ఆర్‌.గోపిబాల సిబ్బందికి ఆదేశించారు. శుక్రవారం మండ లంలోని పలు రక్షిత నీటి పథకాలను ఆయన పరిశీలించారు. పట్టణ పరిధి పెద్దకోరాడవీధి వద్ద ఉన్న ఓవర్‌ హెడ్‌ ట్యాంకులో నీటి నాణ్యతను తనిఖీ చేశారు. డిప్యూటీ ఎంపీడీవో గోవిందరావు, ఇన్‌చార్జి ఈవో కె.సాయిప్రసాద్‌ తదితరులు ఉన్నారు.

ఆదాయ వనరులపై దృష్టిసారించాలి

టెక్కలి డీఎల్‌పీవో ఐవీ రమణ

పాతపట్నం, ఫిబ్రవరి 27(ఆంధ్ర జ్యోతి): ఆదాయవ నరుల పెంపుదల పై పంచాయతీ పాలకులు దృష్టి సారించాలని టెక్కలి డీఎల్‌పీవో ఐవీ రమణ అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయ సమా వేశ మందిరంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అభివృద్ధి ప్రణా ళికలపై శుక్రవారం జరిగిన శిక్షణలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామసభ లు నిర్వహించి క్షేత్రస్థాయి అవసరాలను గుర్తిస్తూ గ్రామాల అభివృద్ధికి దృష్టిసారించాలి. పరిపాలనాధికారి తిరుపతి పట్నాయక్‌, డిప్యూటీ ఎంపీడీవో వాన రవీంద్ర, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 28 , 2026 | 12:30 AM