పదో తరగతి విద్యార్థులపై పర్యవేక్షణ
ABN , Publish Date - Jan 08 , 2026 | 12:11 AM
పదో తరగతిలో విద్యార్థులు శత శాతం ఫలితాలే లక్ష్యంగా దండుగోపాలపురం జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యా యులు చర్యలు చేపట్టారు. ప్రతి విద్యార్థిని పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.
సంతబొమ్మాళి, జనవరి7(ఆంధ్రజ్యోతి): పదో తరగతిలో విద్యార్థులు శత శాతం ఫలితాలే లక్ష్యంగా దండుగోపాలపురం జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యా యులు చర్యలు చేపట్టారు. ప్రతి విద్యార్థిని పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. విద్యార్థులు ఇళ్లకు చీకటిపడిన తర్వాత వెళ్లి వారిని చదివించేందుకు తల్లిదం డ్రులకు హెచ్‌ఎం పిట్ట గంగన్న ఉపాధ్యాయులు భాస్కరరావు, లక్ష్మీనా రాయణ, నాగేశ్వరరావు సూచనలు చేస్తున్నారు.ఈ మేరకు దండుగోపాలపురం జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు రాత్రిపూట విద్యార్థుల ఇళ్ల సందర్శన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.