Share News

ఉర్లాం సమీపంలో సాంకేతిక లోపంతో నిలిచిన సూపర్‌ఫాస్ట్‌ రైలు

ABN , Publish Date - Nov 08 , 2026 | 01:10 AM

హౌరా నుంచి ఎంజీఆర్‌ చెన్నై వెళ్లే సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో సాంతిక లోపం తలెత్తడంతో ఉర్లాం రైల్వేస్టేషన్‌కు సమీపంలో నిలిచిపోయింది.

 ఉర్లాం సమీపంలో సాంకేతిక లోపంతో నిలిచిన సూపర్‌ఫాస్ట్‌ రైలు
ఉర్లాం వద్ద సాంకేతిక లోపంతో నిలిచిన రైలు

నరసన్నపేట, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): హౌరా నుంచి ఎంజీఆర్‌ చెన్నై వెళ్లే సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో సాంతిక లోపం తలెత్తడంతో ఉర్లాం రైల్వేస్టేషన్‌కు సమీపంలో నిలిచిపోయింది. శనివారం ఉదయం 5.30 గంటలు సమయంలో రైలు ఇంజనీన్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో రైలును మెయిన్‌ లైన్‌పై నిలిపివేశారు. విశాఖపట్నం రైల్వే ఇంజనీరింగ్‌ అధికారులతో లోకో పైలట్లు సంప్రదించారు. ఇంజనీరింగ్‌ అధికారులు సూచనల మేరకు సాంకేతిక లోపం సవరించి సుమారు అరగంట తరువాత రైలు శ్రీకాకుళం రోడ్‌కు కదిలింది. మెయిన్‌ లైన్‌ మీద నిలిచిపోవడంతో ఆ మార్గంలో వెళ్లే రైళ్లు సుమారు 30 నిమిషాల పాటు ఆలస్యంగా నడిచినట్లు ఉర్లాం స్టేషన్‌ రైల్వే అధికారులు తెలిపారు.

Updated Date - Nov 08 , 2026 | 01:10 AM