Share News

మధ్యాహ్నం ఎండలు.. సాయంత్రం వర్షాలు

ABN , Publish Date - Apr 08 , 2026 | 12:07 AM

జిల్లాలో కొద్దిరోజులుగా విచిత్ర వాతా వరణ పరిస్థితి కనిపిస్తున్నాయి. ప్రీమాన్‌సూన్‌ కావడంతో మధ్యాహ్నం ఎండలు కాచి సాయంత్రం ఉరుములు, మెరుపులతో మేఘావృతమై ఒక్కసారిగా వడగళ్ల వర్షాలు కురుస్తున్నాయి.

మధ్యాహ్నం ఎండలు.. సాయంత్రం వర్షాలు
రాణ కూడలిలో రోడ్డుపక్కన ఆరబెట్టిన ధాన్యాన్ని పోగుచేస్తున్న రైతులు :

జలుమూరు, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొద్దిరోజులుగా విచిత్ర వాతా వరణ పరిస్థితి కనిపిస్తున్నాయి. ప్రీమాన్‌సూన్‌ కావడంతో మధ్యాహ్నం ఎండలు కాచి సాయంత్రం ఉరుములు, మెరుపులతో మేఘావృతమై ఒక్కసారిగా వడగళ్ల వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రబీలో వంశధార ఆయకట్టుతోపాటు జలవనరులు అందుబాటులో ఉన్న చోట వరి సాగుచేసిన రైతులు అవస్థలకు గురవుతున్నారు. ప్రస్తుతం కోతకురావడంతో యంత్రాలతో నూర్పిడిచేసి విక్రయించేందుకు ఆరబెడు తున్నారు. అయితే పదినిమిషాల్లో మేఘావృతమై అకస్మాతుగా వర్షం కురుస్తుం డడంతో ఆరబెట్టిన ధాన్యం పోగుచేసే సమయంలోనే తడిచిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం జలుమూరు మండలంలోని శ్రీముఖలింగం, అచ్యుతాపురం, నగిరికటకం, కొమనాపల్లి, సురవరం, పాగోడు, కోనసింహాద్రిపేట, రాణ, జలుమూరు తదితర ప్రాంతాల్లో వంశధార కాలువల కింద వేసిన వరి పంట కోతకు రావడంతో ముమ్మరంగా కోతులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రబీలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయకపోవడంతో ధాన్యాన్ని కొనే నాఽథుడు లేక వాటిని ఎండబెట్టి భద్రపరచడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు.

Updated Date - Apr 08 , 2026 | 12:07 AM