Share News

పౌలీ్ట్ర పరిశ్రమకు వేసవి గండం!

ABN , Publish Date - May 25 , 2026 | 12:22 AM

Chickens dying from the heat గతంలో ఎన్నడూలేని విధంగా ఈ వేసవిలో ఎండలు పౌలీ్ట్ర పరిశ్రమను దెబ్బ తీస్తున్నాయి. ఎండల ధాటికి వడగాలులు తోడవుతుండడంతో పౌలీ్ట్రఫారాల్లో పదుల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. దీంతో నిర్వాహకులు తమకు నష్టం తప్పడం లేదని ఆందోళన చెందుతున్నారు.

పౌలీ్ట్ర పరిశ్రమకు వేసవి గండం!
సీతారాంపురంలోని ఆబోతుల సత్యం ఫారంలో ఇటీవల వడదెబ్బకు గురై మృతిచెందిన కోళ్లు

  • వేడిగాలులకు చనిపోతున్న కోళ్లు

  • రణస్థలం మండలంలోనే అధికం

  • నిర్వాహకులకు భారీ నష్టం

  • రణస్థలం, మే 24(ఆంధ్రజ్యోతి):

  • రణస్థలం మండలం కమ్మసిగడాం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడంతో కోళ్లఫారం ఏర్పాటు చేసుకున్నాడు. లక్షలాది రూపాయలతో షెడ్లు నిర్మించాడు. వ్యాపారం బాగా సాగుతుందనుకుంటున్న తరుణంలో వేసవి తాపంతో ఒక్కసారిగా కోళ్లు మృత్యువాత చెందాయి. దీంతో బాగా నష్టం తప్పదని ఆందోళన చెందుతున్నాడు.

  • లెంకపేట గ్రామానికి చెందిన రవికుమార్‌ ఇంటర్‌ వరకూ చదువకున్నాడు. స్థానికంగా ఉంటూ ఉపాధి పొందవచ్చన్న భావనతో కోళ్ల పెంపకంపై దృష్టి సారించాడు. కానీ ఈ ఏడాది వేసవి ప్రారంభం నుంచి కోళ్లు మృత్యువాత చెందుతుండడంతో ఆందోళనతో ఉన్నాడు.

  • గతంలో ఎన్నడూలేని విధంగా ఈ వేసవిలో ఎండలు పౌలీ్ట్ర పరిశ్రమను దెబ్బ తీస్తున్నాయి. ఎండల ధాటికి వడగాలులు తోడవుతుండడంతో పౌలీ్ట్రఫారాల్లో పదుల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. దీంతో నిర్వాహకులు తమకు నష్టం తప్పడం లేదని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది యువత కోళ్లఫారాల ద్వారా స్థానికంగా జీవనోపాధి పొందుతున్నారు. వ్యవసాయంతో అనుసంధానంగా కోళ్లను పెంచుతున్నారు. ఒక్క రణస్థలం మండలం పరిధిలోని 250 కోళ్ల ఫారాలు ఉన్నాయి. సుమారు 15 లక్షల వరకూ కోళ్లను పెంచుతున్నారు. ఎచ్చెర్లలో 2 లక్షల కోళ్లు, లావేరు 50వేల కోళ్లు, జి.సిగడాంలో 2 లక్షల వరకూ కోళ్లు పెంచుతున్నారు. జిల్లాలో గుడ్లుపెట్టే కోళ్లఫారాలు సైతం విరివిగా ఉన్నాయి. కోడిపిల్లలు ధరతోపాటు నిర్వహణ ఖర్చులు పెరగడం, ఇప్పుడు వేసవి తాపానికి కోళ్లు చనిపోతుండడంతో నిర్వాహకులు నష్టపోతున్నారు. ఒక్కో కోడి అందుబాటులోకి వచ్చేసరికి 45 రోజుల సమయం పడుతుంది. దాని సంరక్షణకు రూ.160 ఖర్చు చేయాల్సి వస్తోంది. వర్షాలు లేక కోళ్లమేతకు ఉపయోగించే మొక్కజొన్న, తవుడు కొరత ఏర్పడి మేత ఖర్చులు పెరిగిపోయాయి. విద్యుత్‌ చార్జీలు కూడా పెరిగిపోయాయి. ఎండ తీవ్రతతో కోళ్ల ఉత్పత్తి కూడా తగ్గిపోయింది. మరోవైపు వడగాల్పుల దెబ్బకు 20 నుంచి 25 రోజుల వ్యవధిలో కోళ్లు మృతి చెందడంతో నిర్వహణ కష్టమవుతోందని నిర్వాహకులు వాపోతున్నారు. కోళ్లు ఎండల తీవ్రతను తట్టుకునేలా షెడ్లకు చుట్టూ తడి గోనె సంచులు కడుతున్నారు. వాటికి ఎప్పటికప్పుడు నీటితడులు అందిస్తున్నారు. రణస్థలం మండలంలో నీటికొరత ఉండడంతో ట్యాంకర్ల ద్వారా నీటిని తెస్తున్నామని, అదనపు భారం తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

  • నిర్వహణ కష్టం

  • ఫారాల్లో కోళ్లు మృతి చెందుతున్నాయి. ఇందులో 25 రోజులు పూర్తిచేసుకున్నవే అధికం. వాటిపై సుమారు రూ.100 వరకూ ఖర్చుచేశాం. ప్రతిరోజూ పదుల సంఖ్యలో కోళ్లు మృతిచెందుతున్నాయి. గత మూడు రోజుల్లో 100 కోళ్లు వడగాల్పులకు మృత్యవాత పడ్డాయి. ఇలా అయితే కోళ్లఫారాల నిర్వహణ చాలా కష్టం.

    - ఆబోతుల సత్యం, కోళ్లఫారం నిర్వాహకుడు, సీతారాంపురం

  • జాగ్రత్తలు తప్పనిసరి

  • వేసవిలో కోళ్లఫారం నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలి. కోళ్లకు నీరు విరివిగా అందించాలి. షెడ్ల చుట్టూ తడి గోనె సంచులు పెట్టాలి. ఎండ తీవ్రత, వేడిగాలులకు దూరంగా ఉంచితేనే కోళ్లు బతుకుతాయి. ఈ నెల రోజులపాటు చాలా జాగ్రత్తగా ఉండాలి.

    - బంటుపల్లి దుర్గారావు, పశుసంవర్ధక శాఖ ఏడీ, రణస్థలం

Updated Date - May 25 , 2026 | 12:22 AM