Share News

కూర్మ క్షేత్రంలో సుదర్శన హోమం

ABN , Publish Date - Jul 27 , 2026 | 12:44 AM

ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం కూర్మనాథ ఆలయంలో ఆది వారం ఉదయం అష్టాక్షరి సదుర్శన హోమం వైభవం గా నిర్వహించారు.

కూర్మ క్షేత్రంలో సుదర్శన హోమం
హోమాన్ని నిర్వహిస్తున్న అర్చకులు

గార, జూలై 26(ఆంధ్రజ్యోతి): ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం కూర్మనాథ ఆలయంలో ఆది వారం ఉదయం అష్టాక్షరి సదుర్శన హోమం వైభవం గా నిర్వహించారు. వర్షాభావ, అనావృష్టి పరిస్థితుల దృష్ట్యా లోక కల్యా ణం కోసం భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవం విజయవం తంగా జరిగేందుకు వీలుగా దేవదాయశాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు ఈ హోమాన్ని నిర్వహించారు. తొలుత స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై ఉంచి పూజలు నిర్వహించారు. అనంతరం ప్రధాన అర్చకులు చామర్ల సీతారామ నరసింహాచార్యులు, ఇతర అర్చక బృం దం సుదర్శన హోమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు ట్రస్టుబోర్డు సభ్యులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Updated Date - Jul 27 , 2026 | 12:44 AM