అందరి భాగస్వామ్యంతోనే విజయవంతం
ABN , Publish Date - Jul 29 , 2026 | 12:12 AM
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ము ఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడుల ఆధ్వర్యం లో ఆగస్టు 1న తలపెట్టిన భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని...అందరి భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని చీరాల ఎమ్మెల్యే కొండయ్య తెలిపారు.
కోటబొమ్మాళి/నందిగాం జూలై 28 (ఆంధ్రజ్యోతి): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ము ఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడుల ఆధ్వర్యం లో ఆగస్టు 1న తలపెట్టిన భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని...అందరి భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని చీరాల ఎమ్మెల్యే కొండయ్య తెలిపారు. ఆయన మంగళవారం స్థానిక ఎన్టీఆర్ భవనంలోను, నందిగాంలోని కల్యాణ మండపంలోనూ టీడీపీ నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో జనసమీకరణ కార్యక్రమానికి తనను ఇన్‌చార్జిగా నియమించారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు బోయిన సత్యశ్రీనివాస్, పీఏసీఎస్ డైరెక్టర్ సాసుమంతు ఆనంద్, తదితరులు పాల్గొన్నారు. నందిగాంలో జరిగిన సమావేశంలో నియోజకవర్గ పొలిటికల్ ఇన్‌చార్జి మెట్ల రమణబాబు, పి.జోగారావు, అజయ్‌కుమార్, చంద్రశేఖర్, ఎం.బాలకృష్ణ, ఎస్.జానకిరాం, మదన్‌గౌడ్, ఎం.లోకనాథం, జనసేన నాయకులు చిరంజీవి, షణ్ముఖరావు, సోమేశ్వర రావు, బీజేపీ నాయకులు కామరాజు, జగన్ పాల్గొన్నారు.