పంట నష్టంపై నివేదిక ఇవ్వండి
ABN , Publish Date - Sep 28 , 2026 | 11:49 PM
తుఫాన్ ప్రభావిత గ్రామాల్లో అధికారులు పర్యటించి ఎంత పంట నష్టం జరిగిందో అంచనా వేసి నివేదిక ఇవ్వాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆదేశించారు. సోమవారం పలాస టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గంలోని అధికారులతో సమీక్షించారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ రైతుల వారిగా పంట నష్టం అంచనా వేయాలని, ఎంత మంది రైతులు ఉన్నారో నివేదిక సిద్ధం చేయాలని కోరారు.
పలాస, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): తుఫాన్ ప్రభావిత గ్రామాల్లో అధికారులు పర్యటించి ఎంత పంట నష్టం జరిగిందో అంచనా వేసి నివేదిక ఇవ్వాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆదేశించారు. సోమవారం పలాస టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గంలోని అధికారులతో సమీక్షించారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ రైతుల వారిగా పంట నష్టం అంచనా వేయాలని, ఎంత మంది రైతులు ఉన్నారో నివేదిక సిద్ధం చేయాలని కోరారు.
ఫమందస, సెప్టెంబరు28 (ఆంధ్రజ్యోతి): తుఫాన్ బాధితులకు అండగా ప్రభు త్వం నిలుస్తోందని ఎమ్యెల్యే శిరీష తెలిపారు. మండలంలోని గెడ్డూరులో మత్స్యకార కుటుంబానికి 50 కిలోల చొప్పున బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని తహసీల్దార్ బి.శ్రీహరిరావు అధ్యక్షతన ప్రారంభించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బావన దుర్యోధన, మాధవరావు, లబ్బ రుద్రయ్య,తాతారావు, ఎం.చంద్రశేఖర్, నవీన్, వెంకట రావు, ఈశ్వరరావు పాల్గొన్నారు. కాగా నాతుపురం బొడ్లూరులో పుచ్చమీనాక్షి, రట్టిలో పులారి దుర్యోధన, గెడ్డూరులో వంక యాదవరావు కుటుంబ సభ్యులను పరామర్శించి మృతికి గల కారణాలను గౌతు శిరీష అడిగి తెలుసుకున్నారు.
ఫకాశీబుగ్గ, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీ పరిధిలోని మూడు రోడ్ల జంక్షన్ వద్ద రైతుబజారు నిర్మాణానికి ఎమ్మెల్యే గౌతు శిరీష శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఏపీ టీపీసీ చైర్మన్ వజ్జ బాబురావు, జిల్లా గ్రంఽథాలయ సంస్థ చైర్మన్‌విఠల్‌రావు, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాసరావు, లోడగల కామేశ్వరరావు, గాలి కృష్ణారావు, నరేంద్ర, రవిశంకర్‌టుప్తా, మురళృకృష్ణ, సూర్యనారాయణ పాల్గొన్నారు.