Share News

నీట మునిగిన ఎద పొలాలు

ABN , Publish Date - Jun 21 , 2026 | 11:30 PM

గత వారం రో జులుగా కరుస్తున్న వర్షాలకు పల్లపు ప్రాంతాల్లోని వరి ఎద పొలాలు నీటిలో మునిగి చెరువులను తలపిస్తున్నా యి.

నీట మునిగిన ఎద పొలాలు
దబ్బపాడు గ్రామ సమీపంలో నీట మునిగిపోయిన వరి ఎద పొలాలు

  • ఆందోళనలో రైతులు

ఎల్‌ఎన్‌ పేట, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): గత వారం రో జులుగా కరుస్తున్న వర్షాలకు పల్లపు ప్రాంతాల్లోని వరి ఎద పొలాలు నీటిలో మునిగి చెరువులను తలపిస్తున్నా యి. ఎదలు చల్లిన తరువాత ప్రతీరోజూ వర్షాలు కురు స్తుండడంతో ఈ పరిస్థితి నెలకొంది. విత్తనాలు మొక్కలు రాకముందే ముంపునకు గురవ్వడంతో రైతులు తీవ్ర ఆం దోళన వ్యక్తం చేస్తున్నారు. తురకపేట, దబ్బపాడు, వాడవ లస, చిట్టిమండలం, సుమంతాపురం, ధనుకువాడ, మిరి యాపల్లి, కోవిలాం, లక్ష్మీనర్సుపేట తదితర గ్రామాల పరిధిలో వందల ఎకరాల్లో ఎదలు వేశారు. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కుస్తుండడంతో మొలకలు వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండోసారి విత్తనాలు వేద్దామంటే విత్తనాల కొరత కలుగుతుందని ఆయా గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు. నాలుగైదురోజుల వరకు వర్షం కురవకపోతే మొలకలు వచ్చే అవకాశం ఉండొచ్చని రైతులు ఆశపడుతున్నారు. వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది పల్లపుప్రాంతాల్లో పర్యటించి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ద్వారా ఉచితంగా విత్తనాలను అందజేయాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు.

Updated Date - Jun 21 , 2026 | 11:30 PM