Share News

నీటమునిగిన పంట పొలాలు

ABN , Publish Date - Aug 23 , 2026 | 11:56 PM

జిల్లాలో శని, ఆదివారాల్లో కురిసిన వర్షాలకు పలుచోట్ల పంట పొలాలు నీటిముని గాయి. వృక్షాలు, కరెంటు స్తంభాలు నేలకూలాయి. వర్షాలకు రోడ్లపై నుంచి నీరు ప్రవహిస్తుండడంతో ప్రజలు రాకపోకలకు అవస్థలు పడుతున్నారు.

నీటమునిగిన పంట పొలాలు
ఎల్‌.ఎన్‌.పేట: పెద్దకోట సమీపంలో నీట మునిగిన పంటపొలాలు

జిల్లాలో శని, ఆదివారాల్లో కురిసిన వర్షాలకు పలుచోట్ల పంట పొలాలు నీటిముని గాయి. వృక్షాలు, కరెంటు స్తంభాలు నేలకూలాయి. వర్షాలకు రోడ్లపై నుంచి నీరు ప్రవహిస్తుండడంతో ప్రజలు రాకపోకలకు అవస్థలు పడుతున్నారు.

ఫ ఎల్‌.ఎన్‌.పేట, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): పెద్దకోట, లక్ష్మీనర్సుపేట, కోవిలాం, రావిచెంద్రి, ధనుకువాడ, దబ్బపాడు, చిట్టిమండలం, తురకపేట, దబ్బపేట పంట పొలాలు నీటిమునిగాయి. చెరువులు, కాలువలు నిండడంతో దిగువప్రాంతాలకు నీరు ప్రవహిస్తోంది. శనివారం వేకువజాము నుంచి కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు పల్లపు ప్రాంతాల్లోని పంటపొలాల్లో నీరుచేరింది. లక్ష్మీనర్సుపేట- పెద్దకోట రోడ్డు మీద నుంచి నీరు ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.

ఫనరసన్నపేట, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): మండలంలోని చిక్కాలవలసలో విద్యుత్‌ స్తంభాలు నెలకొరిగాయని గ్రామస్థులు తెలిపారు. గ్రామంలో ఒక్కసారిగా గాలులువీయడంతో రెండు స్తంభాలు నెలకొరిగాయని, ఆ సమయంలో వీధుల్లో ఎవ్వరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెబుతున్నారు.

ఫసంతబొమ్మాళి, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): మండలంలోని డీపీఎన్‌రోడ్డులో పాలేశ్వరస్వామి ఆలయం సమీపంలో వర్షానికి నీరు చేరడంతో చెరువును తలపి స్తోంది. తంపరలో అక్రమంగా రొయ్యిల చెరువుల ఏర్పాటుతో వర్షం నీరు రోడ్డుపై నిలిచిపోవడంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Updated Date - Aug 23 , 2026 | 11:56 PM