విద్యార్థులు క్రమశిక్షణతో అభ్యసించాలి
ABN , Publish Date - Jan 28 , 2026 | 11:50 PM
విద్యార్థులు క్రమశిక్షణతో అభ్యసించా లని డీఈవో మాణిక్యంనాయుడు తెలిపారు. పాఠశాలలో మౌలిక సదుపా యాలు పూర్తిస్థాయిలో సమకూర్చాలని చెప్పారు.
గుర్ల, జనవరి 28(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు క్రమశిక్షణతో అభ్యసించా లని డీఈవో మాణిక్యంనాయుడు తెలిపారు. పాఠశాలలో మౌలిక సదుపా యాలు పూర్తిస్థాయిలో సమకూర్చాలని చెప్పారు. బుధవారం మండలం లోని మన్యపురిపేట, వల్లాపురం, కెల్ల పాఠశాలలను పరిశీలించారు. బెల్లా నపేట పాఠశాలలో మరుగుదొడ్లు లేవని డీఈవో దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపరిచే విధం గా కృషి చేయాలని సూచించారు. రైజింగ్ స్టార్ విద్యార్థులను షైనింగ్ స్టార్ విద్యార్థులుగా తీసుకురావడానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఆయన వెంట ఎంఈవో భాను ప్రకాష్, మజ్జి శ్రీనివాసరావు ఉన్నారు.