బస్సులు నిలపాలని విద్యార్థుల ఆందోళన
ABN , Publish Date - Sep 02 , 2026 | 11:50 PM
డీఆర్ వలస కూడలి వద్ద బస్సులు నిలుపుదల చేయా లని డిమాండ్ చేస్తూ బుధవారం విద్యార్థులు, గ్రామస్థులు బస్సులను అడ్డుకుని నిరసన తెలి పారు.
డీఆర్‌వలస కూడలి వద్ద నిరసన
జి.సిగడాం, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): డీఆర్ వలస కూడలి వద్ద బస్సులు నిలుపుదల చేయా లని డిమాండ్ చేస్తూ బుధవారం విద్యార్థులు, గ్రామస్థులు బస్సులను అడ్డుకుని నిరసన తెలి పారు. డి.బొండపల్లి ఉన్నత పాఠశాల వద్ద బస్సులు నిలుపుదల చేయక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థు లు ఆవేదన వ్యక్తంచేశారు. ఆర్టీసీ బస్సులు నిలపక పోవడంతో సమయానికి పాఠశాలలు, కళాశాలలకు వెళ్లలేక తరగతులను కోల్పోతున్నామని వాపోయారు. పాఠశాల వద్ద విద్యార్థులు, గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసు కున్న పోలీసులు అక్కడికి వచ్చి నిరసన కారులకు నచ్చ జెప్పి ఆందోళనను విరమింప జేశారు. సుమారు గంట కాలం ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.