విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి
ABN , Publish Date - Sep 10 , 2026 | 11:03 PM
విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి.రామ్మోహన్ డిమాండ్ చేశారు.
శ్రీకాకుళం ఎడ్యుకేషన్, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి.రామ్మోహన్ డిమాండ్ చేశారు. గురువారం శ్రీకాకుళంలోని యూటీఎఫ్ కార్యాలయంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్లీనరీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విద్యారంగంపై ప్రభుత్వాల నిర్లక్ష్యం పెరుగుతోందని, ప్రభుత్వ విద్యాసంస్థలకు తగిన నిధులు కేటాయించకపోవడంతో నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాలు అందడంలేదని తెలిపారు. అనంతరం 21 మందితో కమిటీ ఏర్పాటుచేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చందు,కార్యదర్శి ఖగేష్ పాల్గొన్నారు.