Share News

విద్యార్థులకు చట్టాలపై అవగాహన అవసరం

ABN , Publish Date - Nov 06 , 2026 | 11:47 PM

ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు చట్టాలు, సోషల్‌ మీడియాపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి ఎం.రోషిణి అన్నారు.

 విద్యార్థులకు చట్టాలపై అవగాహన అవసరం
విద్యార్థులతో మాట్లాడుతున్న న్యాయాధికారి రోషిణి

జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి రోషిణి

కోటబొమ్మాళి, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు చట్టాలు, సోషల్‌ మీడియాపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి ఎం.రోషిణి అన్నారు. శుక్రవారం ఆమె స్థానిక బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు సౌకర్యాలు... పౌష్టికాహారం అందుతున్నాయా? సమయానికి భోజనం పెడుతున్నారా? ఇంకా ఏమైనా అవసరం ఉందా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. బాగా చదువుకుని తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరును తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల న్యాయవాదుల సంఘం అధ్యక్షులు ఎల్‌.శ్రీనివాసరావు, ఉన్న త పాఠశాల హెచ్‌ఎం సీహెచ్‌.రమాదేవి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 06 , 2026 | 11:47 PM