Share News

జేఈఈ మెయిన్స్‌-2లో సిక్కోలు సత్తా

ABN , Publish Date - Apr 21 , 2026 | 11:59 PM

JEE Mains-2 results జాతీయస్థాయిలో పేరొందిన ఎన్‌ఐటీ, ఐఐటీ, ఐఐఐటీలో ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి జేఈఈ మెయిన్స్‌-2 ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఉత్తమ ర్యాంకులతో ప్రతిభ చూపారు.

జేఈఈ మెయిన్స్‌-2లో సిక్కోలు సత్తా

  • జిల్లా విద్యార్థులకు ఉత్తమ ర్యాంకులు

  • పాతపట్నం/ ఎచ్చెర్ల/ రణస్థలం/ నరసన్నపేట/ ఆమదాలవలస/ కాశీబుగ్గ/ పొందూరు, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): జాతీయస్థాయిలో పేరొందిన ఎన్‌ఐటీ, ఐఐటీ, ఐఐఐటీలో ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి జేఈఈ మెయిన్స్‌-2 ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఉత్తమ ర్యాంకులతో ప్రతిభ చూపారు. పాతపట్నానికి చెందిన కొండాల కనిష్క 113వ ర్యాంక్‌ సాధించి.. జిల్లాస్థాయిలో ప్రథమస్థానంలో నిలిచాడు. 300మార్కులకుగానూ 286 మార్కులుసాధించి 99.99 శాతం పర్సంటైల్‌ సాధించాడు. కనిష్క తండ్రి డా.కొండాల చత్రపతి స్థానిక ప్రభుత్వ ఆదర్శ డిగ్రీకళాశాల ప్రిన్సిపాల్‌. తల్లి పుష్పలత పాతపట్నం మండలం తామరలో ఎస్జీటీగా విధులు నిర్వహిస్తున్నారు. కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌లో రాణించాలన్నదే తనలక్ష్యమని కనిష్క తెలిపాడు.

  • పొందూరుకి చెందిన కోరుకొండ శ్రీవ్య జనరల్‌ క్యాటగిరీలో 99.9957 పర్సంటైల్‌తో 108వ ర్యాంకు సాధించింది. ఓబీసీ కేటగిరీలో జాతీయస్థాయిలో 17 వ ర్యాంకును దక్కించుకుంది. విద్యార్థిని తండ్రి కోరుకొండ కృష్ణారావు ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తల్లి లక్ష్మీరాజ్యం ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలు. ఐఐటీ, ముంబాయి లేదా మద్రాస్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ చేసి తరువాత ఐఏఎస్‌ పూర్తి చేసి ప్రభుత్వ సర్వీసులో స్థిరపడాలనేది తన ఆశయమని శ్రావ్య తెలిపింది.

  • ఆమదాలవలస పట్టణంలోని పూజారిపేటకు చెందిన చింతాడ అజయ్‌కుమార్‌ 99.88 శాతం పర్సంటైల్‌ సాధించాడు. ఆలిండియా స్థాయిలో 2009 ర్యాంకు సాధించాడు. అజయ్‌కుమార్‌ తల్లిద్రండులు వెంకటరమణ, అమ్మాజీ, సామాన్య కుటుంబానికి చెందినవారు.

  • రణస్థలం మండలం పతివాడపాలేం గ్రామానికి చెందిన మహంతి హర్షవర్థన్‌ ఆలిండియాస్థాయిలో 1,320 ర్యాంకు సాధించాడు. ఓబీసీలో 236 ర్యాంకు దక్కించుకున్నాడు. ఐఐటీలో కంప్యూట్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ చదవడం తన లక్ష్యమని హర్షవర్థన్‌ తెలిపాడు. తండ్రి మహంతి అప్పలనాయుడు పైడిభీమవరంలోని పరిశ్రమలో సీనియర్‌ క్యూసీగా విధులు నిర్వహిస్తున్నాడు. తల్లి రమాదేవి గృహిణి .

  • ఎచ్చెర్ల మండలం కుశాలపురంలో నివాసం ఉంటున్న పైడి దినేష్‌ జాతీయస్థాయిలో ఓబీసీలో 296వ ర్యాంకు సాధించాడు. ఈ విద్యార్థి తండ్రి పైడి లక్ష్మీపతి న్యాయవాది కాగా, తల్లి టి.నిర్మల ప్రభుత్వ పాఠశాలలో ఉపాఽధ్యాయిని. ముంబాయి ఐఐటీలో ఇంజనీరింగ్‌ చేయాలన్నదే తన లక్ష్యమని దినేష్‌ తెలిపారు. వీరిది స్వస్థలం టెక్కలి మండలం ధర్మనీలాపురం గ్రామం.

  • నరసన్నపేటలోని శ్రీరామనగర్‌కు చెందిన అల్లు రోహిత్‌ జాతీయస్థాయిలో 444వ ర్యాంకు సాధించాడు. తండ్రి షణ్ముఖరావు ఒక ప్రైవేటు బీఈడీ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. తల్లి లలితాంబ గృహిణి. అడ్వాన్స్‌లో ప్రతిభ కనపరిచి ముంబై ఐఐటీలోని సీఎస్‌లో సీటు సాఽధించడమే తనలక్ష్యమని రోహిత్‌ చెప్పాడు.

  • నరసన్నపేట మండలం తండేలవానిపేటకు చెందిన తండేల పవన్‌సాయి జాతీయస్థాయిలో 837 వ ర్యాంకు సాధించారు. తల్లిదండ్రులు జనార్దనరావు, పద్మావతి.. ఇద్దరూ ఉపాధ్యాయులే. అడ్వాన్స్‌లో మంచి స్కోర్‌ సాధించి దేశంలోని టాప్‌ 5 ఐఐటీలో సీటు సాఽధించడమే తన లక్ష్యమని పవన్‌సాయి తెలిపాడు.

  • కాశీబుగ్గ చినబడాం మారుతీనగర్‌కు చెందిన బొడ్డ సుమిత్‌ 176వ ర్యాంకు సాధించాడు. సుమిత్‌ తండ్రి బొడ్డ రమేష్‌బాబు విశ్రాంతి ఆర్మీ ఉద్యోగి. తల్లి బొడ్డ ధనలక్ష్మీ గృహిణి. ముంబై ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ చేయడమే తన లక్ష్యమని సుమిత్‌ చెప్పాడు.

  • జలుమూరు మండలం దరివాడ గ్రామానికి చెందిన దుంగ చాణుక్య ఓబీసీలో 15,911వ ర్యాంకు సాధించాడు. తండ్రి దుంగ పాపారావు టైలర్‌ వృతి చేసుకొని జీవనం సాగిస్తున్నారు. తల్లి పావని గృహిణి

Updated Date - Apr 21 , 2026 | 11:59 PM