రెండు ద్విచక్ర వాహనాల ఢీ.. విద్యార్థి మృతి
ABN , Publish Date - Jan 25 , 2026 | 12:41 AM
జలు మూరు నుంచి చల్లవానిపేట వెళ్లే రోడ్డులో ధర్మారావుతోట మలుపు వద్ద శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో పాతపట్నం మండలం బడ్డుమర్రిపాలెం గ్రామానికి చెందిన గొటివాడ రుషి (13) మృతి చెందాడు.
ఐదుగురికి గాయాలు
జలుమూరు, జనవరి 24(ఆంధ్రజ్యోతి): జలు మూరు నుంచి చల్లవానిపేట వెళ్లే రోడ్డులో ధర్మారావుతోట మలుపు వద్ద శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో పాతపట్నం మండలం బడ్డుమర్రిపాలెం గ్రామానికి చెందిన గొటివాడ రుషి (13) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రుషి చిన్నాన్న సంకిలి తిరుపతిరావుతో కలిసి ద్వి చక్రవాహనంపై చల్లవానిపేట వెళ్తుండగా.. సరుబుజ్జిలి మండలం తెలుగుపెంట గ్రామానికి చెందిన యారబాటి భాస్కరరావు తన బైక్‌పై మరో ముగ్గురితో ఎదు రుగా వస్తూ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తిరుపతిరావుకి చెందిన బైక్ వెనుక కూర్చున్న రుషి అక్కడికక్కడే మృతి చెందగా.. మిగిలిన ఐ దుగురు గాయపడ్డారు. భాస్కరరావు బైక్‌పై కూర్చున్న తెలుగుపెంట గ్రామానికి చెందిన నందివాడ గిరిజ, కొమనాపల్లికి చెందిన కనుసు విశాలాక్షి, కొండపోలవ లసకు చెందిన పల్ల రమ్య గాయపడ్డారు. వీరు ముగ్గురు డిగ్రీ చదువుతున్నారు. సమాచారం తెలుసుకున్న జలుమూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనంలో చికిత్స నిమిత్తం నరసన్నపేట సామాజిక ఆసు పత్రికి తరలించారు. కాగా రుషి తల్లిదండ్రులు భవాని, నాగేశ్వరరావు కూలి పనులు నిమిత్తం వైజాగ్‌లో ఉండగా.. జలుమూరు గ్రామానికి చెందిన తన చిన్నా న్న సంకిలి తిరుపతిరావు ఇంటిలో ఉంటూ జలుమూరు ప్రభుత్వ బాలురు ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. చెల్లి రుక్మిణి జలుమూరు కేజీబీవీలో ఐదో తరగతి చదువుతుంది. రుషి పిన్ని సంకిలి శారద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు హెచ్‌సీ రాజశేఖర్ తెలిపారు.
తోటలో మృతదేహం లభ్యం
కొత్తూరు, జనవరి 24(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని బమ్మిడి కాలనీకి చెందిన దవిలి సంతోష్ (35) ఆ గ్రామ సమీప తోటలో మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. శనివారం బహిర్భూమికి వెళ్లినవారు చూడడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మద్యానికి బానిసైన సంతోష్ వారం రోజులుగా ఇంటికి రాలేదు. ఎప్పటిలాగే ఎక్కడికో వెళ్లి ఉంటాడని కుటుంబ సభ్యులు భావించారు. ఈ క్రమంలో శనివారం సంతోష్ మృతి చెందిన విషయం తెలుసుకుని లబోదిబోమంటున్నారు. పెయింటింగ్స్ వేసి జీవనం సాగిస్తున్న సంతోష్ మృతి చెందడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. సంతోష్‌కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహం బాగా కుళ్లిపోడంతో తోటలోనే శవపంచ నామా నిర్వహించినట్టు తెలిపారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.