కేజీబీవీలో కలకలం
ABN , Publish Date - Jul 09 , 2026 | 11:50 PM
Student illness గార మండలం శాలిహుండంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కలకలం రేగింది. గత రెండు వ్యవధిలో 21 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో విద్యార్థినులు, తల్లిదండ్రులు ఆందోళన చెందారు.
రెండు రోజుల్లో 21 మంది విద్యార్థినులకు అస్వస్థత
గార, జూలై 9 (ఆంధ్రజ్యోతి): గార మండలం శాలిహుండంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కలకలం రేగింది. గత రెండు వ్యవధిలో 21 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో విద్యార్థినులు, తల్లిదండ్రులు ఆందోళన చెందారు. బుధవారం 13 మంది విద్యార్థినులు కడుపునొప్పి, వాంతులతో బాధపడుతుండగా.. వారిని గార పీహెచ్‌సీకి తరలించారు. సాయంత్రం నాటికి వారు కోలుకున్నారు. మళ్లీ గురువారం మరో 8 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారిని కూడా చికిత్స నిమిత్తం గార పీహెచ్‌సీకి తరలించారు. విద్యార్థినులు, తల్లిదండ్రులు ఆందోళన చెందారు. కాగా.. ఈ విషయమై కేజీబీవీ ప్రత్యేకాధికారి బి.రజనీకుమారి వద్ద ప్రస్తావించగా.. ‘రెండు రోజులుగా అస్వస్థతకు గురైన విద్యార్థినులంతా కోలుకున్నారు. తల్లిదండ్రుల అంగీకారం మేరకు వారిని ఇళ్లకు పంపించాం. ప్రస్తుతం విద్యార్థులంతా ఆరోగ్యంగా ఉన్నార’ని తెలిపారు. ఇదిలా ఉండగా సమాచారం తెలిసిన వెంటనే గ్రామ పంచాయతీ కార్యదర్శిని కేజీబీవీకి పంపించి పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టామని ఎంపీడీవో ఎస్.శ్రీనివాసులు తెలిపారు.