మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య
ABN , Publish Date - Nov 16 , 2026 | 12:27 AM
నగరంలోని ఓ వీధికి చెందిన 17 సంవత్సరాల విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.
శ్రీకాకుళం క్రైం, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): నగరంలోని ఓ వీధికి చెందిన 17 సంవత్సరాల విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఎచ్చెర్ల మండలం పొన్నాడ గ్రామానికి చెందిన కశింకోట పవన్‌కుమార్‌తో ఆమెకు ప్రేమ వ్యవహారం నడిచింది. వీరిద్దరూ కలిసి విశాఖలో సరదాగా తిరిగేందుకు వెళ్లారు. అక్కడ ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి. తనను వివాహం చేసుకోవాలని ఆమె పవన్‌ను కోరగా అతడు తిరస్కరించాడు. అయితే పవన్‌కుమార్ బంధువులను పిలిపించి ఆమెను ఇంటి వద్ద శనివారం రాత్రి దింపేశాడు. దీంతో బాలిక మనస్తాపం చెంది తన ఇంటిలోనే గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొంది. ఆదివారం ఉదయం గది తలుపులు తెరిచి చూసిన తల్లికి కుమార్తె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించడంతో ఆవేదనకు గురై కేకలు వేసి ఇరుగు పొరుగు వారిని పిలిచింది. స్థానికుల సమాచారంతో టూటౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఆమె మనస్థాపంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. ఈ మేరకు కశింకోట పవన్‌కుమార్‌పై టూటౌన్ ఎస్‌ఐ హేమంత్‌కల్యాణ్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతురాలు నగరంలోని ఓ కళాశాలలో బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతోంది.