Share News

బీజేపీ గద్దె దిగే వరకూ పోరాటాలు

ABN , Publish Date - Nov 10 , 2026 | 11:32 PM

న్నికల కమిషనర్‌ జ్ఞానేశ్వర్‌ కుమార్‌ను అడ్డుపెట్టుకుని దొంగ ఓట్లతో బీజేపీ కేంద్రంలో గద్దెనెక్కిందని ఏఐసీసీ పరిశీలకుడు, మాజీ ఎంపీ కె.జయకుమార్‌ తెలిపారు.

 బీజేపీ గద్దె దిగే వరకూ పోరాటాలు
మాట్లాడుతున్న జయకుమార్‌

అరసవల్లి, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్వర్‌ కుమార్‌ను అడ్డుపెట్టుకుని దొంగ ఓట్లతో బీజేపీ కేంద్రంలో గద్దెనెక్కిందని ఏఐసీసీ పరిశీలకుడు, మాజీ ఎంపీ కె.జయకుమార్‌ తెలిపారు. మంగళ వారం శ్రీకాకుళంలోని ఇందిరావిజ్ఞాన్‌ భవన్‌లో డీసీసీ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు అధ్యక్షతన విలేకరులతో మాట్లాడారు. ప్రతి రాష్ట్రంలోనూ ఓట్ల తొలగింపు జరిగిందని, దీనిపై రాహుల్‌ గాంధీ నాయకత్వంలో ఓట్‌ బచావోదేశ్‌ బచావో నిరసన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వ హిస్తున్నా మని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గద్దె దిగే వరకు పోరా టాలు చేస్తామని చెప్పారు. యూత్‌ కాంగ్రెస్‌ ద్వారా జిల్లాలో పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు పూడి కిరణ్‌కుమార్‌, నగర అధ్యక్షు డు రెల్ల సురేష్‌, మంత్రి నర్సింహమూర్తి, బి.కృష్ణవేణి, కేవీఎల్‌ఎస్‌ ఈశ్వరి, ఇజ్జురోతు రమణ, కోత మధుసూదనరావు, కె.సింహాద్రినాయుడు, బస్వా షణ్ముఖరావు, లఖినేని నారాయణరావు, బొత్స వెంకటరమణ, బొడ్డేపల్లి రవి, చాంద్‌ భాషా పాల్గొన్నారు.

Updated Date - Nov 10 , 2026 | 11:32 PM