సమస్యలు పరిష్కరించకపోతే పోరాటాలు
ABN , Publish Date - Jul 17 , 2026 | 12:04 AM
కార్మికుల సమస్యలను పరిష్కరిం చకపోతే పోరాటాలు తీవ్రతరం చేస్తామని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, శ్రీకాకుళం నగర పాలక కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ నల్లపల్లి బలరాం, కోకన్వీనర్ కళ్యాణి అప్పలరాజు హెచ్చరించారు.
శ్రీకాకుళం అర్బన్, జూలై 16 (ఆంధ్రజ్యోతి): కార్మికుల సమస్యలను పరిష్కరిం చకపోతే పోరాటాలు తీవ్రతరం చేస్తామని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, శ్రీకాకుళం నగర పాలక కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ నల్లపల్లి బలరాం, కోకన్వీనర్ కళ్యాణి అప్పలరాజు హెచ్చరించారు. గురువారం శ్రీకాకుళం నగర పాలక సంస్థ కార్యాల యం వద్ద పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, పని ముట్లు ఇవ్వాలనిధర్నా నిర్వహించారు. అనంతరం కమిషనర్‌కు వినతిప త్రం అందిం చారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల జేఏసీ నాయకులు అరుగుల గణేష్, రమణ, రామచంద్ర, శంకరగణేష్, రాము, జె.గురుమూర్తి, ఆర్.గణేష్, రమణ, రామచంద్ర, పార్వ తి, సీతమ్మ, జ్యోతి ప్రసాద్,సీతమ్మ, సూర్యకళ, వెంకటరమణ పాల్గొన్నారు.