Share News

‘విద్యారంగ సమస్యల పరిష్కారానికి పోరాటం’

ABN , Publish Date - Aug 16 , 2026 | 11:49 PM

ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి డి.సరస్వతి అన్నారు.

‘విద్యారంగ సమస్యల పరిష్కారానికి పోరాటం’
మాట్లాడుతున్న ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి సరస్వతి

శ్రీకాకుళం ఎడ్యుకేషన్‌, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి డి.సరస్వతి అన్నారు. ఆదివారం నగరంలో ఎన్జీవో హోంలో సంఘం జిల్లాశాఖ అధ్యక్షుడు చావలి శ్రీనివాస్‌ అధ్యక్షతన జిల్లా సబ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 2023 జూలై నుంచి 12వ పీఆర్సీ అమలు చేయాలని, 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలన్నారు. డీఏ బకాయిలు చెల్లించాలని, 11వ పీఆర్సీ బకాయిలను పరిష్కరించాలని, సరండర్‌ లీవ్‌ నగదు విడుదల చేయాల న్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుమలరావు మాట్లాడుతూ.. ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ రద్దుచేసి, పదోన్నతులు కల్పించాలన్నారు. కార్యక్రమంలో సంఘ నాయులు భీమారావు, ఎస్వీ అనిల్‌కుమార్‌, కొప్పల భానుమూర్తి, పి.శ్రీరామ్మూర్తి పాల్గొన్నారు.

Updated Date - Aug 16 , 2026 | 11:49 PM