Share News

‘ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా పోరాటం’

ABN , Publish Date - Oct 31 , 2026 | 11:59 PM

పీడిత వర్గాల ప్రజలు తమ రాజ్యాంగ బద్ధమైన హక్కులను కా పాడుకోవాలంటే ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని సీపీఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ కార్యదర్శి తాండ్ర ప్రకాష్‌ అన్నారు.

  ‘ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా పోరాటం’
కోరన్న, మంగన్న చిత్రపపటాల వద్ద నివాళులర్పిస్తున్న వామపక్ష నాయకులు

పలాసరూరల్‌, అక్టో బరు 31 (ఆంధ్రజ్యోతి): పీడిత వర్గాల ప్రజలు తమ రాజ్యాంగ బద్ధమైన హక్కులను కా పాడుకోవాలంటే ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని సీపీఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ కార్యదర్శి తాండ్ర ప్రకాష్‌ అన్నారు. బొడ్డపాడు అమరవీరుల స్మారక మందిరంలో శనివారం శ్రీకాకుళం గిరిజన రైతాంగ సాయుధ పోరాటంలో అమరులుగా నిలిచిన కోరన్న, మంగన్నల 59వ వర్ధంతి ని నిర్వహించారు. భద్రగిరిలో ఆదివాసీలపై జరుగుతున్న దోపిడీలకు వ్యతిరేకంగా పోరాడారని, వారి పోరాట స్ఫూర్తితో నేటితరం పాలకుల దురాక్రమణపై పోరు సాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు ఎస్‌.రాజశేఖర్‌, వంకల మాధవరావు, గొరకల బాలకృష్ణ, జుత్తు వీరాస్వామి, పి.కుసుమ, బదకల ఈశ్వరమ్మ, కుత్తుమ హేమక్క, రాపాక మాధవరావు, గర్తం కామేశ్వరరావు, పి.మల్లేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Oct 31 , 2026 | 11:59 PM