ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం
ABN , Publish Date - Aug 18 , 2026 | 11:46 PM
ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానా లను అవలంబిస్తున్నాయని వీటిని ప్రతిఘటి ద్దామని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.తిరు పతిరావు అన్నారు.
ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి తిరుపతిరావు
శ్రీకాకుళం కలెక్టరేట్, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానా లను అవలంబిస్తున్నాయని వీటిని ప్రతిఘటిద్దామని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.తిరు పతిరావు అన్నారు. రాష్ట్రవ్యాప్త పిలుపు లో భాగంగా మంగళవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. దశాబ్దాల పోరాటాల ఫలితంగా కార్మి కులు సాధించు కున్న హక్కులను కాలరాస్తూ కేంద్రం నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చిం దని, దీంతో కార్మికులు తమ హక్కులు కోల్పో నున్నారన్నారు. గత 11 ఏళ్లలో పేదరికం 17 శాతం పెరగడం దారుణమన్నారు. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, 8 గంటల పని దినాలు కల్పించాలని, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, ఆశా, అంగన్‌వాడీ, ఆర్పీలు, ఇతర స్కీం వర్లర్లను రెగ్యులర్ చేయాలని డి మాండ్ చేశారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు కె.అప్పలరాజు, వై.సూర్య నారా యణ, బి.అప్పల రాజు, చిన్నారావు పాల్గొన్నారు.