ఫిట్ శ్రీకాకుళం లక్ష్యంగా కృషి
ABN , Publish Date - Jul 25 , 2026 | 12:22 AM
ఫిట్ శ్రీకాకుళం దిశగా తీర్చిదిద్దేందుకు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కృషి చేస్తున్నా రని, ఇందులో భాగంగా ఎర్రన్న క్రీడోత్స వం చేపట్టారని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.
ఎమ్మెల్యే గొండు శంకర్
ఎంపీ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం
శ్రీకాకుళం స్పోర్ట్స్, జూలై 24 (ఆంధ్రజ్యోతి): ఫిట్ శ్రీకాకుళం దిశగా తీర్చిదిద్దేందుకు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కృషి చేస్తున్నా రని, ఇందులో భాగంగా ఎర్రన్న క్రీడోత్స వం చేపట్టారని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. ఎంపీ కప్ బ్మాడ్మింటన్ టోర్నమెంట్‌ను స్థానిక శాంతినగర్ కాలనీలోని ఇండోర్ స్టేడి యంలో శుక్రవారం ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో బాక్స్ క్రికెట్, కబడ్డీ టోర్నమెంట్ చేపట్టారని, ఇప్పుడు బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు. అంతకు ముందు దివంగత కేంద్రమంత్రి కింజరాపు చిత్రపటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. బ్యాడ్మింటన్ ఆడి పోటీలను ప్రారం భించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్య క్షురాలు తమ్మినేని సుజాత, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి దుంగ భాస్కర్, టీడీపీ నాయ కులు బోర గోవిందరావు, టీడీపీ పట్టణ కోశాఽధి కారి కెల్ల కిషోర్ కుమార్, జిల్లా బ్యాడ్మింటన్ అసోసి యేషన్ కార్యదర్శి మెట్ట అశోక్‌కుమార్, సీఈవో సంపతిరావు సూరిబాబు పాల్గొన్నారు.