Share News

ప్రజల సమస్యలు పరిష్కారానికి కృషి

ABN , Publish Date - Jul 06 , 2026 | 11:51 PM

ప్రజల సమస్యలు తెలుసుకొని సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు.

ప్రజల సమస్యలు పరిష్కారానికి కృషి
వినతిపత్రం పరిశీలిసున్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు:

రణస్థలం, జూలై 6 (ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్యలు తెలుసుకొని సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. సోమవారం రణస్థలంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో సమస్యలపై ప్రజలు ఇచ్చిన వినతిపత్రాలను స్వీకరించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి కొన్ని సమస్యలు పరిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారం రోజుల్లో మరికొన్ని సమస్యలు పరిష్కరిస్తానన్నారు. ప్రజా సమస్యలు తన దృష్టికి వస్తే సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని, ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడవద్దని తెలిపారు.

Updated Date - Jul 06 , 2026 | 11:51 PM