Share News

మత్స్యకారుల సంక్షేమానికి కృషి

ABN , Publish Date - Oct 02 , 2026 | 12:06 AM

మత్స్యకార కుటుంబాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పీయూసీ చైర్మన్‌, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ తెలిపారు. గురువారం మునిసిపాలిటీలోని 18వవార్డు పరిధి కొత్త కండ్రపేటలో నివసిస్తున్న 130 మత్స్యకార కుటుంబాలను గుర్తించి ఒక్కో కుటుంబానికి 50 కిలోల చొప్పున బియ్యాన్ని పంపిణీ చేశారు.

 మత్స్యకారుల సంక్షేమానికి కృషి

ఆమదాలవలస, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): మత్స్యకార కుటుంబాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పీయూసీ చైర్మన్‌, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ తెలిపారు. గురువారం మునిసిపాలిటీలోని 18వవార్డు పరిధి కొత్త కండ్రపేటలో నివసిస్తున్న 130 మత్స్యకార కుటుంబాలను గుర్తించి ఒక్కో కుటుంబానికి 50 కిలోల చొప్పున బియ్యాన్ని పంపిణీ చేశారు.

ఫబూర్జ, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): అల్లెనలో 530 మంది తుఫాన్‌ బాధితులకు ఎమ్మెల్యే కూన రవికుమార్‌ బియ్యం పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్క్‌ఫెడ్‌ డైరెక్టర్‌ రామకృష్ణనాయుడు, మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వ ప్రసాద్‌, రాంజీ, రాంబాబు, కృష్ణారావు పాల్గొన్నారు.

ఫఇచ్ఛాపురం, అక్టోబరు1 (ఆంధ్రజ్యోతి): ఈదుపురంలో తుఫాన్‌ నేపథ్యంలో మత్స్యకారులకు తక్షణ సాయం కింద బియ్యాని మండల యువత అధ్యక్షుడు బోర యువరాజు గురువారం పంపిణీచేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మాజీ సభ్యుడు రాజేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు.

ఫఎచ్చెర్ల, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): ఎస్‌ఎంపురంలోని మత్స్యకారులకు 50 కిలోల బియ్యం, కందిపప్పు, పంచదార, వంటనూనె, బంగాళాదుంపలు కిలో వంతున డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ చౌదరి అవినాష్‌ అందజేశారు.

Updated Date - Oct 02 , 2026 | 12:06 AM