శతశాతం విజయానికి కృషి
ABN , Publish Date - Sep 20 , 2026 | 12:15 AM
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాల సమన్వయంతో శతశాతం విజయానికి కృషి చేయాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.
ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు
రణస్థలం, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాల సమన్వయంతో శతశాతం విజయానికి కృషి చేయాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. శనివారం మండల కేంద్రం లో ఎచ్చెర్ల టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి లంక శ్యామలరావు అధ్యక్షతన కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబునాయుడు నాయకత్వంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు ముప్పిడి సరేష్, బెండు మల్లేశ్వరరావు, చౌదరి బాబ్జి, డీజీఎం ఆనందరావు, దెయ్యం శ్రీనివాస్, పిన్నింటి భానోజినాయుడు, కనకారావు, దన్నాన మహేష్ పాల్గొన్నారు.