Share News

దొంగతనాల నియంత్రణకు పటిష్ఠ చర్యలు

ABN , Publish Date - Jan 11 , 2026 | 12:10 AM

సంక్రాంతికి సొంత గ్రామాలకు వెళ్లేవారు విలువైన సొత్తును ఇంట్లో ఉంచవద్దని కాశీబుగ్గ డీఎస్పీ షేక్‌ సహ బాజ్‌ అహ్మద్‌ సూచించారు.

దొంగతనాల నియంత్రణకు పటిష్ఠ చర్యలు
విలేకరులతో మాట్లాడుతున్న డీఎస్పీ అహ్మద్‌

  • కాశీబుగ్గ డీఎస్పీ షేక్‌ సహబాజ్‌ అహ్మద్‌

కాశీబుగ్గ, జనవరి 10(ఆంధ్రజ్యోతి): సంక్రాంతికి సొంత గ్రామాలకు వెళ్లేవారు విలువైన సొత్తును ఇంట్లో ఉంచవద్దని కాశీబుగ్గ డీఎస్పీ షేక్‌ సహ బాజ్‌ అహ్మద్‌ సూచించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో దొంగతనాలు పెరుగుతున్న దృష్ట్యా సబ్‌ డివిజన్‌ పరిధిలోని పోలీసు స్టేషన్లకు పటిష్ఠ చర్యలపై కీలక ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు. పలాస-కాశీబుగ్గ జంట పట్ట ణాలతో పాటు అన్ని ప్రధాన ప్రాంతాల్లో నిఘా పెంచినట్టు చెప్పారు. స్వగ్రామాలకు సంక్రాంతికి వెళ్లేవారు ఇంటికి తాళాలలు సరిగ్గా వేయాల న్నారు. రాత్రి 10 గంటల తర్వాత ఎవరు బహిరం గ ప్రదేశాల్లో తిరగొద్దన్నారు. ప్రజలు ఇంటర్‌ లాకింగ్‌ సిస్టంను.. పోలీసుల సత్వర సేవలను సం బంధించి యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విపరీతమైన పొగమంచు కారణం గా.. సాయంత్రం ఉదయం వేళల్లో ప్రయాణాలు చేయకపోవడం మంచిదని అన్నారు. అనుమా నంగా ఎవరైనా సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

గంజాయిపై ప్రత్యేక నిఘా

మద్యం తాగి వాహనాలు నడిపితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. యువత గంజాయి, డ్రగ్స్‌కు బానిసై జీవితాన్ని నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. సంక్రాంతి అని బహిరంగ ప్రదే శాల్లో గ్రూప్‌లుగా ఉండి ఇలాంటి కార్యక్రమాలు చేపడితే ఉపేక్షించేదిలేని స్పష్టం చేశారు. పలాస- కాశీబుగ్గ పట్టణంలో ప్రధాన జంక్షన్లలో యువత గుంపులుగా ఏర్పడి హల్‌చల్‌ చేస్తున్నట్టు సమాచా రం ఉందని, ఇటువంటి వాటిపై ప్రత్యేక నిఘా ఏ ర్పాటు చేశామన్నారు. ముఖ్యంగా పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వొదని తల్లిదండ్రులను కోరారు.

Updated Date - Jan 11 , 2026 | 12:10 AM