Share News

విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు

ABN , Publish Date - Mar 03 , 2026 | 12:03 AM

విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ హెచ్చరించారు.

విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు
పారిశుధ్య పనులను పరిశీలిస్తున్న జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌

శ్రీకాకుళం కలెక్టరేట్‌, మార్చి 2(ఆంధ్రజ్యోతి): విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ హెచ్చరించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో చేపడుతున్న ప్రత్యేక పారిశుధ్య పను లను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశా రు. తెల్లవారుజామున 5.30 గంటలకే ఆయన క్షేత్ర స్థాయిలో పర్యటించి పనులను పరిశీలించారు. రైతుబజార్‌, అరస వల్లి వెలమవీధి, గొంటివీధి, పుణ్యపువీధి తదితర ప్రాం తాల్లో పర్యటించారు. కాలువల్లో పేరుకుపోయిన పూడిక లను చూసి ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. మురుగు నీటి ప్రవాహానికి అడ్డు లేకుండా పూర్తి స్థాయిలో చెత్త ను తొలగించాలని ఆదేశించారు. దుకాణాల ఎదుట డస్ట్‌ బిన్‌లను ఏర్పాటు చేసుకోవాలని, చెత్త సేకరణ వాహ నాలు వచ్చినప్పుడు చెత్తను అందించాలని సూచించారు. రోడ్లపై చెత్త వేసే దుకాణదారులకు జరిమానా విధిం చాలని మునిసిపల్‌ అధికారులకు ఆదేశించారు. ప్రజా రోగ్యంతో చెలగాటమాడితే ఎంతటి వారైనా సహించేది లేదని హెచ్చరించారు.

డయేరియా కట్టడికి చర్యలు

డయేరియా నివారణకు గాను కలెక్టర్‌ ఆదేశాలతో సోమవారం నగరంలోని 48 వార్డులలో సిల్ట్‌ తొలగింపు ప్రక్రియ చేపట్టారు. సోమవారం ఒక్కరోజు 112.5 టన్నుల వ్యర్థాలను డంపింగ్‌ యార్డుకు తరలించారు. కాలువల్లో పూడికతీతకు 14 ఎక్స్‌కవేటర్లు, 18 ట్రాక్టర్లను వినియోగించారు.

Updated Date - Mar 03 , 2026 | 12:03 AM